September 5, 2022
హీరోయిన్గా వెండితెరపై తమన్నా రొమాంటిక్ సీన్స్, డ్యాన్స్, స్పెషల్ నంబర్స్ (ఐటమ్‌సాంగ్స్) అదుర్స్ అనిపించేలా ఉంటాయి. అయితే తమన్నా యాక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ‘బాహుబలి’ సినిమాలో కాస్త చూపించారు. అదే ఫుల్‌లెంగ్త్‌లో ఎలా ఉంటుందో బబ్లీ బౌన్సర్లో చూడొచ్చు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. మధుర్ బండార్కర్ ఈ సినిమాను తెరకెక్కించారు. సానంద్ వర్మ, సాహిల్, అమ్రిత పాండే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. స్టార్ స్టూడియోస్, అమ్రిత పాండే, వీనిత్ జైన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ కానుంది. అంటే సెప్టెంబరు 23 నుంచి ఈ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ బబ్లీ బౌన్సర్ చిత్రంలో తమన్నా చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి.
ఇక ‘బబ్లీబౌన్సర్’ కథ విషయానికి వస్తే..నార్త్‌లో ఓ గ్రామీణ ప్రాంతంలో జన్మించిన బబ్లీ అనే అమ్మాయికి వివాహం చేయాలనుకుంటారు. కానీ బబ్లీకి ఏమో ఉద్యోగం చేయాలని ఆశ. అందుకని ఢిల్లీ వెళుతుంది. అక్కడ లేడీ బౌన్సర్‌గా మారుతుంది. బబ్లీ లేడీ బౌన్సర్‌గా మారిన తర్వాత ఏం జరిగింది? ఈ ఉద్యోగంఆమెకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేలా చేసింది? అన్నది కథాంశం. ట్రైలర్లో తమన్నా చేసిన యాక్షన్ సన్నివేశాలు అద్భతంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఫుల్ యాక్షన్ మాత్రం ఈ నెల 23 నుంచే!