ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా వేణు స్వామి బయోపిక్ చిత్రమా.. వేణు స్వామి కామెంట్స్ వైరల్!

April 30, 2024

ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా వేణు స్వామి బయోపిక్ చిత్రమా.. వేణు స్వామి కామెంట్స్ వైరల్!

వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన జ్యోతిష్యులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఇటీవల కాలంలో వేణు స్వామి సినిమా సెలబ్రిటీలకు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జాతకాలను చెబుతూ వార్తలలో నిలిచారు. ఈ విధంగా తరచూ ఏదో ఒక సెలబ్రిటీ గురించి ఈయన జాతకం చెబుతూ పెద్ద ఎత్తున వివాదాలను కూడా ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నటువంటి వేణు స్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా ద్విపాత్రాభినయంలో నటించినటువంటి చిత్రం అదుర్స్. వివి వినాయక్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ నరసింహ అలాగే చారి అనే రెండు పాత్రలలో నటించారు ఇక చారి అనే పాత్రలో ఈయన ఒక పురోహితుడు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా గురించి వేణు స్వామి మాట్లాడుతూ ఈ సినిమా పూజ కార్యక్రమాలను తానే చేశానని తెలిపారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల తర్వాత ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టగానే అందులో పువ్వు వచ్చింది ఆ క్షణమే ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని తెలిపాను. ఇకపోతే వినాయక్ ఈ సినిమా నా బయోపిక్ చిత్రంగా చేశారు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో మీ పాత్ర చారి పాత్రన లేకపోతే నరసింహ పాత్రన అని ప్రశ్నించగా రెండు పాత్రలు తనవేనంటూ వేణు స్వామి తెలిపారు.

తాను పండితులుగా పూజలు చేస్తున్నాను జాతకాలు చెబుతున్నాను అలాగే నరసింహ పాత్రలో మాదిరిగా వ్యాపారాలు చేస్తున్నాను పబ్ నడుపుతున్నాను అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.

Read More: భారీ ధరకు అమ్ముడైన తండేల్ డిజిటల్ రైట్స్.. ఈ సారి హిట్ గ్యారెంటి అంటూ?

Related News

ట్రెండింగ్ వార్తలు