April 30, 2024
టాలీవుడ్ హీరో నాగచైతన్య గురించి మన అందరికి తెలిసిందే.. నాగ చైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. చైతన్య వరసగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే చై ప్లాప్స్ లో ఉన్నాడని చెప్పాలి. ఆయన గత చిత్రాలు థాంక్యూ, కస్టడీ నిరాశపరిచాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. తన మిత్రుడు చందు మొండేటి తో చేతులు కలిపాడు. తండేల్ టైటిల్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ చేశారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది.
ఇప్పటికే కొంత మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య జాలరి రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి రూపొందిస్తున్నారు. ఎమోషనల్ లవ్ డ్రామా అని సమాచారం. నాగ చైతన్య లుక్ చాలా రఫ్ అండ్ రస్టిక్ గా ఉంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఆ సంగతి పక్కన పెడితే తండేల్ డిజిటల్ రైట్స్ అమ్ముడైనట్లు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
తండేల్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఏకంగా రూ. 40 కోట్లకు డీల్ సెట్ అయ్యిందట. ఇది నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ అంటున్నారు. నాగ చైతన్య గత చిత్రాలు ప్లాప్ అయినప్పటికీ ఈ స్థాయిలో రేటు పెట్టడానికి కారణాలు ఉన్నాయట. కాంబినేషన్ పై నెట్ఫ్లిక్స్ ప్రతినిధులు నమ్మకంతో ఉండి ఉండవచ్చు. చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 భారీ విజయం అందుకుంది. హిందీలో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. చందూ మొండేటి నుండి వస్తున్న తదుపతి చిత్రం కావడం తండేల్ చిత్రానికి ఇంత డిమాండ్ ఏర్పడి ఉండవచ్చు. ఇంత వరకు కనీసం టీజర్ కూడా రాలేదు. రికార్డు స్థాయిలో ధర పలికింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే ఈసారి నాగచైతన్య హిట్ కొట్టడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
Read More: రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన అల్లు అర్జున్.. ఒక్క మూవీకి ఏకంగా అన్ని కోట్లా?