వెట్రిమారన్ “విడుదల పార్ట్ 1” ఇంటెన్స్ ట్రైలర్ విడుదలైంది*

April 8, 2023

వెట్రిమారన్ “విడుదల పార్ట్ 1” ఇంటెన్స్ ట్రైలర్ విడుదలైంది*
కోలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరైన వెట్రిమారన్ తాజా చిత్రం విడుతలై పార్ట్ 1. వెట్రిమారన్ రచించి, దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మార్చి 31న తమిళనాడు అంతటా మరియు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా ఏప్రిల్ 15న విడుదల చేస్తున్నారు.
సినిమా విడుదలకు ముందు, ఈరోజు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. విచారణ పేరుతో మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్న పోలీసులపై పెరుమాళ్ మాస్టర్ (విజయ్ సేతుపతి ) పోరాటం మరియు అతని కోసం పోలీసు బలగాలు వెతకడం గురించి ఈ ట్రైలర్ లో అర్ధమవవుతుంది.
సూరి ఈ చిత్రంలో కానిస్టేబుల్ కుమరేశన్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించినప్పటికీ, చిత్ర కథానాయకుడు సూరి అని తెలుస్తుంది. అన్యాయం గురించి అతను పడే నిరాశ మరియు అసమర్థతను కూడా ట్రైలర్‌లో చూపించారు. పెరుమాళ్‌కు ఏం జరుగుతుంది, చివరకు ఎవరు పట్టుకుంటారు అనేది కథ. వెట్రిమారన్ రియలిస్టిక్ టేకింగ్, అరెస్టింగ్ స్కోర్ మరియు చివర్లో సూరి స్టంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి.
ఈ పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ మరియు పలువురు నటించారు, వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని RS ఇన్ఫోటైన్‌మెంట్ మరియు గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఆర్ వేల్‌రాజ్ సినిమాటోగ్రాఫర్‌ పనిచేశారు. మాస్ట్రో ఇళయరాజా చిత్రం మొత్తం సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు