పుట్టినరోజు జరుపుకుంటున్న బేబీ హీరోయిన్.. ఏదైనా అప్డేట్ ఇచ్చేనా?

January 4, 2024

పుట్టినరోజు జరుపుకుంటున్న బేబీ హీరోయిన్.. ఏదైనా అప్డేట్ ఇచ్చేనా?

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగాను హీరోయిన్లుగాను కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియా ద్వారా సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి వారిలో నటి వైష్ణవి చైతన్య ఒకరు. ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో కవర్ సాంగ్స్ చేసేవారు. అదేవిధంగా మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలసి పలు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఇలా వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఒక్కసారిగా ఎంతో మంచి ఫేమస్ అయ్యారు.

ఈ విధంగా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటించినటువంటి ఈమె ఏకంగా బేబీ సినిమాలో అవకాశం అందుకున్నారు. సాయి రాజేష్ అనే దర్శకుడి దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్ గా మొదటి సినిమాతోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి వైష్ణవి చైతన్య నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున వైష్ణవి చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు. నేడు ఈమె పుట్టినరోజు కావడంతో ఈమె సినిమాలకు సంబంధించిన ఏదైనా అప్డేట్ విడుదల చేస్తారా అని అభిమానులు కూడా ఎంతో ఎదురుచూస్తున్నారు. బేబీ సినిమా ఎంతో విజయవంతమైన తర్వాత ఈమె తదుపరి సినిమాల గురించి ఎలాంటి ప్రకటన లేదు అయితే సాయి రాజేష్ అందించిన కథతో ఈమె మరోసారి ఎస్కేఎన్ నిర్మాణంలో ఆనంద దేవరకొండ తో కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏ విధమైనటువంటి పోస్టర్స్ కూడా విడుదల చేయలేదు. మరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈమె తన సినిమా నుంచి ఏదైనా అప్డేట్ విడుదల చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read More: బలవంతంగా ఎన్టీఆర్ పాటను కాపీ చేయించారు.. మణిశర్మ కామెంట్స్ వైరల్! 

ట్రెండింగ్ వార్తలు