చిరంజీవి కలిసి టాలీవుడ్ డైరెక్టర్స్.. ఎందుకో తెలుసా?

April 15, 2024

చిరంజీవి కలిసి టాలీవుడ్ డైరెక్టర్స్.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూసిన చిరంజీవి ఇప్పుడు విశ్వంభర మూవీతో ఎలా అయిన సక్సెస్ను అందుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు ఈ మెగా మూవీలో నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్ల లోని ముచ్చింతల్ లో జరుగుతోంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు దర్శకులు విశ్వంభర సెట్స్ కు వెళ్లి చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిశారు. మేన 4 తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే సందర్భంగా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కావాలని అసోసియేషన్ ప్రతినిధులు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. కాగా ఈ సందర్భంగా ఆహ్వానాన్ని స్వీకరించిన చిరంజీవి తప్పకుండా ఎల్బీ స్టేడియం ఈవెంట్ కు హాజరవుతానని మాట ఇచ్చారు.

చిరంజీవిని కలిసిన వారిలో కేవీ అనుదీప్, సాయి రాజేశ్‌, మెహర్ రమేశ్‌, శ్రీరామ్ ఆదిత్య తదితర దర్శకులు ఉ్నారు. ప్రస్తుతం ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా విశ్వంభర సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వంభర మూవీ పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Read More: కాల్పుల ఘటనపై స్పందించిన సల్మాన్ ఖాన్ తండ్రి.. ఆయన రియాక్షన్ ఇదే?

ట్రెండింగ్ వార్తలు