ఆ ఆలయంలోనే అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం.. ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

May 9, 2024

ఆ ఆలయంలోనే అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం.. ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐశ్వర్య కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఈమె పలు కన్నడ తమిళ భాష చిత్రాలలో నటించారు. ఇలా హీరోయిన్గా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఐశ్వర్య త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు.

నటి ఐశ్వర్య ప్రముఖ తమిళ నటుడు కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే .ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో మంచి సన్నిహిత్య ఉంది ఉమాపతితో పరిచయం ప్రేమ ఏర్పడిందని అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపి పెళ్లి చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇక వీరిద్దరిని నిశ్చితార్థం అక్టోబర్ 17వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థపు వేడుక జరిగింది అయితే జూన్ 10వ తేదీ వీరి వివాహపు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే వీరి వివాహం ఓ ప్రముఖ ఆలయంలో జరగబోతుందని సమాచారం. అర్జున్ హనుమాన్ భక్తుడు అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అర్జున్ ఆంజనేయ స్వామి పై ఉన్నటువంటి భక్తితో ఏకంగా తన సొంత డబ్బులతోనే ఆలయం నిర్మించారు. అయితే ఈ ఆలయంలోనే తన కుమార్తె ఐశ్వర్య వివాహం కూడా జరగబోతుందని ప్రకటించారు. ఇక ఈ కుటుంబానికి సెలబ్రిటీలు మొత్తం హాజరుకారని కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుకలు జరగబోతున్నాయని తెలుస్తోంది.

Read More: నా పెళ్లి జరిగేది అక్కడే… పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన దేవర బ్యూటీ?

Related News

ట్రెండింగ్ వార్తలు