నా పెళ్లి జరిగేది అక్కడే… పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన దేవర బ్యూటీ?

May 9, 2024

నా పెళ్లి జరిగేది అక్కడే… పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన దేవర బ్యూటీ?

జాన్వీ కపూర్ పరిచయమవసరం లేని పేరు శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి వరకు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. అయితే ప్రస్తుతం ఈమె తెలుగులో కూడా సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. తెలుగులో కూడా ఈమె ఏకంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు అందుకోవడంతో ఈమె పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది.

ప్రస్తుతం తన కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తరచు తన వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తలలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ ప్రముఖ వ్యాపారవేత్త శిఖర్‌ పహారియాతో ఆమె డేట్‌ చేస్తుందని తెలుస్తుంది. ఈ ఇద్దరు కలిసి కెమెరాకి చిక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌పై సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా వీరిద్దరూ కలిసి పలు సందర్భాలలో తిరుమల స్వామి వారిని కూడా దర్శించుకున్నారు త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ తాను తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానని తెలియజేశారు.

ఇక పెళ్లి సమయంలో తాను తప్పనిసరిగా గోల్డ్ శారీ కట్టుకుంటాను అంటూ ఈ సందర్భంగా ఆమె పెళ్లి ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే విషయాలను తెలిపారు. అయితే తన పెళ్లి ఎప్పుడు ఎవరిని చేసుకుంటుందనే విషయాలను మాత్రం ఈమె తెలియజేయలేదు. తన ప్రియుడిని పెళ్లాడుతుందా లేదా అనే విషయాలను ప్రకటించకపోయిన పెళ్లి మాత్రం తిరుపతిలోనే చేసుకుంటానని తెలిపారు. ఇక తిరుపతి అంటే శ్రీదేవికి కూడా చాలా ఇష్టం అందుకే ఈమె కూడా తరచూ తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.

Read More: థియేటర్లకు దూరంగా ప్రేక్షకులు.. ఆ కారణంతోనే సినిమాలు చూడలేదా?

ట్రెండింగ్ వార్తలు