ఇట్స్ అఫీషియల్.. గుడ్ న్యూస్ చెప్పిన నటి మీనా?

December 24, 2023

ఇట్స్ అఫీషియల్.. గుడ్ న్యూస్ చెప్పిన నటి మీనా?

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి మీనా(Actress Meena) ఒకరు. ఈమె తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలు అందరికి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇటీవల కాలంలో ఈమె జీవితంలో పెద్ద విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.

విద్యాసాగర్ మరణించి ఏడాదిన్నర అవుతున్న ఇప్పటికీ ఈమె ఆయన మరణ వార్త నుంచి బయటపడలేకపోతున్నారు అయితే ఈ విషయాన్ని మర్చిపోవడం కోసం ఈమె తిరిగి తన సినీ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇకపోతే మీనా తనకు సంబంధించి శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈమె సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

విజయ టీవీలో త్వరలోనే ప్రసారం కాబోతున్న జోడీ ఆర్ యు రెడీ అనే ఓ కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరించబోతున్నారని వెల్లడించారు. ఈ విషయాన్ని మీనా(Actress Meena) అధికారికంగా ప్రకటించారు. ఇక ఈమెతో పాటు శ్రీదేవి కూడా జడ్జిగా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎంతోమంది అభిమానులు వెల్కమ్ బ్యాక్ మీన గారు అంటూ కామెంట్ చేస్తున్నారు..

 
View this post on Instagram
 

A post shared by Meena Sagar (@meenasagar16)

Read Moreషర్ట్ విప్పింది..లోపలి అందాల్ని చూపించింది..రీతూ ఫోటోలపై నెటిజన్ల కామెంట్లు

Related News

ట్రెండింగ్ వార్తలు