చిరంజీవితో ఆ పాటకు డాన్స్ చేయటం కోసం కష్టపడ్డాను.. రాధా కామెంట్స్ వైరల్!

March 29, 2024

చిరంజీవితో ఆ పాటకు డాన్స్ చేయటం కోసం కష్టపడ్డాను.. రాధా కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎంతో అద్భుతమైనటువంటి నటుడు అంతేకాకుండా మంచి డాన్సర్ అని కూడా చెప్పాలి. చిరంజీవి పక్కన డాన్స్ చేయాలి అంటే సాధారణ హీరోయిన్లకు కష్టతరమైన పని అని చెప్పాలి. ఈయన పక్కన విజయశాంతి రాధ వంటి వారు మాత్రమే ఆయనకు పోటీ ఇస్తూ డాన్స్ చేసేవారని ఎంతోమంది చెబుతూ ఉంటారు.

ఇకపోతే తాజాగా నటి రాధా చిరంజీవితో డాన్స్ చేయడం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమానికి రాధా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా అలీ ప్రశ్నిస్తూ చిరంజీవి గారితో మీ మొదటి సినిమా ఏంటని అడిగారు. ఈ ప్రశ్నకు ఈమె గుండా సినిమాలో మొదటిసారి చిరంజీవితో కలిసిన నటించానని తెలిపారు.

ఈ విధంగా చిరంజీవితో నటించడం గురించి ఈమె మాట్లాడుతూ… నేనెప్పుడూ కూడా నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని సినిమాలలో నటిస్తాను. నిర్మాతలకు నష్టం రాకుండా ఉండడం కోసమే ప్రతి ఒక్క సన్నివేశం లేదా డాన్స్ అయినా కూడా ఒకే టేక్ లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు.

ఇక చిరంజీవి గారితో పోటీపడి మరి నేను డాన్స్ చేసే దానిని తెలిపారు. అలా పోటీ ఉన్నప్పుడే సినిమా కూడా అద్భుతంగా వస్తుందని రాదా తెలిపారు. అయితే యముడికి మొగుడు సినిమాలో అందం హిందోళం అధరం తాంబూలం పాటకి మాత్రం చిరంజీవితో పాటు డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించినట్లు రాధ గుర్తు చేసుకున్నారు. ఇక చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన మంచి వారు మాత్రమే కాదు నిజాయితీపరులు అంటూ కూడా రాధా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: సిద్ధార్థ్, అదితి సంపాదన ఎంతో తెలుసా.. బిగ్ ట్రీస్ తెచ్చిన సెలబ్రిటీలు?

Related News

ట్రెండింగ్ వార్తలు