సిద్ధార్థ్, అదితి సంపాదన ఎంతో తెలుసా.. బిగ్ ట్రీస్ తెచ్చిన సెలబ్రిటీలు?

March 29, 2024

సిద్ధార్థ్, అదితి సంపాదన ఎంతో తెలుసా.. బిగ్ ట్రీస్ తెచ్చిన సెలబ్రిటీలు?

సౌత్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ సెలబ్రిటీలుగా మారినటువంటి వారిలో నటుడు సిద్ధార్థ్, అదితి రావు హైదరి వంటి వారు ఒకరు. ఈయన హీరోగా సౌత్ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నారు. ఇక అతిధి కూడా సౌత్ నార్త్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా నటిగా మంచి సక్సెస్ అందుకున్నారు. వీరిద్దరూ కలిసి మహాసముద్రం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల తెలంగాణలోని వనపర్తిలో శ్రీరంగనాయక ఆలయంలో వీరిద్దరి వివాహం అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగినట్లుగా న్యూస్ వైరలయ్యింది. తమిళనాడు పురోహితులు వీరిద్దరి పెళ్లి జరిపించారని టాక్ నడిచింది. అయితే తాజాగా తమ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

సిద్ధార్థ్, అదితి తమకు పెళ్లి కాలేదని.. కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగిందంటూ రింగ్ ఫోటోస్ షేర్ చేశారు. అదితితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్ అంటూ సిద్ధార్థ పోస్ట్ చేయగా ఇక సిద్దార్థ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ అతడు ఎస్ చెప్పాడు.. ఎంగేజ్డ్ అంటూ అదితి పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరలవుతుండగా.. సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో వీరి గురించి పెద్ద ఎత్తున ఆరాధిస్తున్నారు. వీరి ఆస్తులు విలువ ఎంత వీరి సంపాదన ఏంటి అనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు. సిద్ధార్థ్ నికర విలువ దాదాపు రూ. 70 కోట్లు. వీటితోపాటు ఖరీదైన కార్లు బంగ్లాలు కూడా ఉన్నాయి. ఇక అదితి వనపర్తి రాజవంశస్తురాలు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించింది. ఆమె నికర విలువ దాదాపు రూ. 60-62 కోట్లు. ఒక్క సినిమాకు దాదాపు ఒక కోటి రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది వీటితోపాటు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

Read More: నాకు తండ్రి కావాలని ఉంది.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు