July 3, 2022
2011లో వచ్చిన తమిళ చిత్రం ‘కో’, 2013లో వచ్చిన ‘సింగమ్ 2’, 2016లో వచ్చిన అల్లు అర్జున్ ‘సరైనోడు’ చిత్రాల్లో ఐటమ్‌సాంగ్స్ చేశారు హీరోయిన్ అంజలి. మళ్లీ ఇప్పుడు తాజాగా మరో ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సాంగ్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలోనిది. నితిన్, కృతీశెట్టి, కేథరీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్టు 12న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ అంజలి ఓ ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయనున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. అంతేకాకుండా.. ఈ సినిమాలో అంజలి లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.