April 4, 2024
2014లో కామెడీ హర్రర్ జోనర్ లో వచ్చిన గీతాంజలి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మంచి హిట్ ని అందుకున్న నటి అంజలి ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా తో మన ముందుకి వస్తుంది. డైరెక్టర్ కోన వెంకట్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించగా శివ తుర్లపాటి డైరెక్షన్ చేస్తున్నారు.
నటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వుతూ భయపెట్టే ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ ట్రైలర్ పై యంగ్ డైరెక్టర్ బాబి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ ఫన్ థ్రిల్లర్ లాగా ఉంది. కోన వెంకట్ గారు మరియు మొత్తం టీం కి బెస్ట్ విషెస్.
ఏప్రిల్ 11న విడుదలవబోయే ఈ సినిమా కోసం తాను కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ఒక పోస్టు పెట్టారు. ఇక ఈ ట్వీట్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరగటం ఖాయం. బాబి ప్రెసెంట్ నందమూరి బాలకృష్ణ 109వ సినిమాకి డైరెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా విషయానికి వస్తే..
ఈ సినిమాలో సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంవివి సినిమాస్ బ్యానర్ తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నటి అంజలి కెరియర్ లో ఈ సినిమా 50వ సినిమా కావటం విశేషం. ఈ సినిమా హిట్ అయితే ఆమెకి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
Read More: అదే డేట్ కి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీ.. మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత డివివి దానయ్య!