ఇకపై నాన్న సినిమాలలో నటించను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆకాష్ పూరి

March 11, 2024

ఇకపై నాన్న సినిమాలలో నటించను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆకాష్ పూరి

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి స్టార్ హీరోలు అందరూ కూడా పూరి జగన్నాథ దర్శకత్వంలో సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ కొట్టిన వారే అనే విషయం మనకు తెలిసిందే.

ఇలా ఒక స్టార్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఈయన తన కొడుకును మాత్రం ఇప్పటివరకు సక్సెస్ చేసుకోలేకపోయారు. పూరి కుమారుడు ఆకాష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు. ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పలు సినిమాలలో నటించారు. అయితే ఇప్పటివరకు ఒక సరైన హిట్ కూడా పడలేదు.

తాజాగా ఈయన ఒక క్లోతింగ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటోంది. ఈ క్లోతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం హ్యాపీగా ఉందని తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి ఆకాష్ వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

మీరు ఇప్పటివరకు మీ నాన్న దర్శకత్వంలో సినిమా చేయలేదు. చేసే ఆలోచనలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తాను మా నాన్న సినిమాలలో నటించాలని నేను అనుకోవడం లేదని తెలిపారు. నటుడిగా నన్ను నేను ప్రూఫ్ చేసుకున్న తర్వాతే నాన్నతో కలిసి ఒక పెద్ద చిత్రం చేస్తానని అప్పటివరకు నాన్నతో సినిమాలు అసలు చేయనని ఈ సందర్భంగా ఆకాష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అనే ప్రశ్న ఎదురవడంతో ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని ఈయన సమాధానం చెప్పారు.

Read More : అనంత్ అంబాని జంటకు కానుకలు ఇచ్చిన సల్మాన్ ఖాన్.. భారీ ట్రోల్ చేస్తున్న నేటిజన్స్?

ట్రెండింగ్ వార్తలు