అనంత్ అంబాని జంటకు కానుకలు ఇచ్చిన సల్మాన్ ఖాన్.. భారీ ట్రోల్ చేస్తున్న నేటిజన్స్?

March 11, 2024

అనంత్ అంబాని జంటకు కానుకలు ఇచ్చిన సల్మాన్ ఖాన్.. భారీ ట్రోల్ చేస్తున్న నేటిజన్స్?

ప్రముఖ వ్యాపారవేత్త అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జామ్ నగర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. మూడు రోజుల పాటు ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం ఈ పెళ్లి వేడుకలలో మూడు రోజుల పాటు సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక సెలబ్రిటీలందరూ కూడా ఆటపాటలతో పెద్ద ఎత్తున ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు.

ఇలా ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం ముఖేష్ అంబానీ దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ పెళ్లి వేడుకలలో సల్మాన్ ఖాన్ సందడి చేశారు అయితే ఈయన అనంత్ అంబానీ రాధిక మర్చంట్ దంపతులకు కానుకలను అందించారని తెలుస్తుంది. అయితే సల్మాన్ ఇచ్చిన కానుకలపై నేటిజన్స్ భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ అనంత్ అంబానీ ఇద్దరు కూడా మంచి స్నేహితులే అయితే తనకు వాచ్ అంటే చాలా ఇష్టం అని తెలిసినటువంటి సల్మాన్ ఖాన్ సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసి అనంత్ అంబానీ కోసం వాచ్ కొన్నారట అదే విధంగా రాధిక మర్చంట్ కోసం ఒక డైమండ్ చైన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇలా కోటి రూపాయల వాచ్ ఇచ్చారని విషయం తెలియడంతో 14 కోట్ల విలువ చేసే వాచ్ కట్టుకున్నటువంటి అనంత్ అంబానికి కోటి రూపాయలు వాచ్ ఇవ్వడం ఏంటి అన్న మరి ఇంత చీపా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా 1000 కోట్లు సెలబ్రేషన్స్ కోసం ఖర్చు చేసి వందలకోట్లతో నగలు ,డ్రస్సులు ధరించినటువంటి ఈ సెలబ్రిటీ కపుల్స్ కి కోటి రూపాయలు ఇవ్వడం చాలా చీప్ అంటూ పలువురు ఈయన ఇచ్చినటువంటి కానుకలపై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలలో సల్మాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ చేయడమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా కూడా పనిచేయడంతో డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా అంటూ మరికొందరు ఈయన వ్యవహార శైలిపై కూడా కామెంట్లు చేస్తున్నారు.

Read More : మెగా కోడలు ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా& #8230; తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ట్రెండింగ్ వార్తలు