Akhil Akkineni: ఏజెంట్‌ ఏమైయ్యాడు!

August 30, 2022

Akhil Akkineni: ఏజెంట్‌ ఏమైయ్యాడు!

అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్‌ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘ఏజెంట్‌’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ అనిల్‌ సుంకర నిర్మాణంలో సురేందర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్‌ మమ్ముట్టీ ఓ కీ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుందని, సినిమా క్వాలిటీ, బడ్జెట్‌ కోసం అఖిల్‌ తన పారితోషికాన్ని కూడా చాలా తగ్గించుకున్నాడని వార్తలు వచ్చాయి. బడ్జెట్‌ ఎక్కువ అవుతున్న కారణంగానే ఈ సినిమా నిర్మాణంలో తొలుత భాగస్మామిగా ఉన్న ఈ చిత్రం దర్శకుడు సురేందర్‌ రెడ్డి తప్పుకున్నారన్న వార్తలు ఉన్నాయి. అలాగే ‘ఏజెంట్‌’ సినిమా రషెష్‌ చూసుకున్న సురేందర్‌రెడ్డి కొన్ని రీ షూట్స్‌ను సజెస్‌ చేశారట అఖిల్‌కు. కానీ వచ్చిన అవుట్‌పుట్‌తో అఖిల్, నాగార్జున సుముఖంగానే ఉన్నారట. ఈ విషయంలో అఖిల్‌కు, సురేందర్‌రెడ్డికి ఏవో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ అట….ఇలా ఏజెంట్‌ గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇక ఏంజెంట్‌ సినిమా 2021న దసరాకు రిలీజ్‌ చేయాలనుకున్నారు. మధ్యలో కొన్ని రిలీజ్‌ డేట్స్‌ మారాయి కానీ ఫైనల్‌గా ఈ ఏడాది ఆగస్టు 12న రిలీజ్‌ అని ప్రకటించారు. సినిమా రిలీజ్‌ సంగతి అలా ఉంచితే..పర్‌ఫెక్ట్ ఏజెంట్‌ టీజర్‌ కూడా ఇప్పటివరకు రిలీజ్‌ కాలేదు. అసలు..ఏజెంట్‌ ఏమైయ్యాడు. ఏజెంట్‌ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది? అనే చర్చలు ఇండస్ట్రీలో జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చలకు ఫుల్‌స్టాప్‌ పడాలంటే ఏజెంట్‌ రిలీజ్‌ గురించి మేకర్స్‌ ఓ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు