April 12, 2024
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీ గురించి వచ్చిన అఖిల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు పూర్తి అవుతున్న కూడా అఖిల్ కెరియర్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సరైన హిట్ ఒకటి కూడా లేదు. ఐదు సినిమాలలో నటించగా అందులో ఒక్క సినిమా కూడా చెప్పుకో దగ్గ స్థాయిలో హిట్ అవ్వలేదు. ఇక అతని చివరగా నటించిన ఏజెంట్ మూవీ కోట్ల బడ్జెట్ తో నిర్మించినప్పటికీ ఊహించని విధంగా దారుణంగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా తర్వాత అఖిల్ మీడియా ముందు కనిపించలేదు.
అక్కినేని అఖిల్ బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమయ్యింది. గత ఏడాది ఏప్రిల్ లో ఏజెంట్ సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ చివరకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. బిగ్ స్క్రీన్ గురించి పక్కన పెడితే సోషల్ మీడియాలో కనిపించడం కానీ మీడియా ముందుకు రావడం కానీ అసలు లేదు. దీంతో ఆఖిల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అభిమానులు అందరూ ఆరా తీస్తున్నారు. అటు మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగానే ఉంటున్నాడు. చాలా కాలం తర్వాత ఆకస్మాత్తుగా ఎయిర్ పోర్టులో కనిపించాడు అఖిల్. తన కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాడు అఖిల్.
ఏప్రిల్ 8న తన పుట్టినరోజు వేడుకలను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుని తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక ఈరోజు ఎయిర్ పోర్టులో అఖిల్ న్యూ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. పొడవాటి జుట్టు, భారీ గడ్డంతో అఖిల్ కొత్త లుక్ లో కనిపించాడు. చూడడానికి అర్జున్ రెడ్డిలా మారిపోయి సరికొత్త లుక్ లో కనిపించి అభిమానులకు ఒకసారిగా షాక్ ఇచ్చాడు అఖిల్. ప్రస్తుతం ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు ఇలాంటి లుక్ లో అఖిల్ కనిపించలేదు. అయితే అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసమే ఇలా మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంకొందరు సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యేసరికి ఇలా జుట్టు గడ్డం పెంచి అర్జున్ రెడ్డిలా మారిపోయాడా అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత అఖిల్ కనిపించడం అందులోనూ సరికొత్త లుక్ లో కనిపించడంతో అందరూ ఆ విషయం గురించి చర్చించుకుంటున్నారు.
https://telugu.chitraseema.org/pushpa-2-makers-spent-%E2%82%B960-crore-on-a-six-minute-scene/