Shah Rukh Khan: అల్లు అయాన్‌ సింగింగ్‌ను మెచ్చిన షారుక్‌.. బన్నీ ఏమన్నారంటే?

February 26, 2024

Shah Rukh Khan: అల్లు అయాన్‌ సింగింగ్‌ను మెచ్చిన షారుక్‌.. బన్నీ ఏమన్నారంటే?

అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ చేసే సరదా పనులతో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. ఇటీవల అయాన్ షారుక్ ఖాన్ డంకీ సినిమాలోని లుట్ పుట్ గయా అనే సాంగ్ ని పాడాడు. అయాన్ పాడుతుండగా వీడియో తీసి ఈ స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అల్లుఅర్జున్ మరొకసారి వైరల్ అయ్యాడు.

అయితే ఈసారి ఏకంగా షారుక్ ఖాన్ తో ప్రశంసలు అందుకునే వరకు వెళ్లిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అర్హ కారులో ప్రయాణిస్తుండగా అయాన్ ఇటీవలే విడుదలై విజయం సాధించిన షారుక్ ఖాన్ డంకీ సినిమాలోని లుట్ పుట్ గయా అనే పాటను పాడాడు. ఈ దృశ్యాన్ని ఫోన్లో రికార్డు చేసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ షారుఖ్ ఖాన్ కి ట్యాగ్ చేశారు.

దీంతో ఈ వీడియోని చూసిన షారుక్ ఖాన్ స్పందిస్తూ థాంక్యూ లిటిల్ వన్ నువ్వు పాడిన పాటలో ఫ్లవర్ ఫైర్ రెండు చూపించావు. నేను కూడా నా పిల్లలకు పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను నేర్పిస్తా అంటూ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ పోస్ట్, అయాన్ పాడిన పాట రెండు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే షారుక్ ఖాన్ పోస్ట్ కి అల్లు అర్జున్ తిరిగి రిప్లై ఇవ్వడం ఇప్పుడు మరింత వైరల్ అయింది.

ఇంతకీ అల్లు అర్జున్ ఏమని రిప్లై ఇచ్చాడంటే షారుక్ జి సో స్వీట్ అఫ్ యు.. మీ స్వీట్ మెసేజ్ కి థాంక్యూ,లాట్స్ ఆఫ్ లవ్ అంటూ పోస్ట్ చేశారు. ఇంకేముంది అల్లు అయాన్ పాట పాడటం, దానికి షారుక్ రిప్లై ఇవ్వడం, దానికి మళ్ళీ అల్లు అర్జున్ తిరిగి రిప్లై ఇవ్వడం తో ఈ వీడియోలని బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. సినిమాల్లోకి రాకముందే అయాన్ బాలీవుడ్ వరకు వెళ్లిపోయాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

Read More: తన సక్సెస్ వెనుక సీక్రెట్ ఇదే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా!

Related News

ట్రెండింగ్ వార్తలు