హ్యాపీ బర్త్ డే మోడల్ అయాన్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోస్?

April 3, 2024

హ్యాపీ బర్త్ డే మోడల్ అయాన్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోస్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు అల్లు అర్జున్ కుమారుడు అయాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో అయాన్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయాన్ సోషల్ మీడియాలో కనిపించారు అంటే నెటిజన్లకు పెద్ద ఎత్తున ఎంటర్టైన్మెంట్ అందిస్తారని చెప్పాలి.

అల్లు అయాన్ సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు తను చేసే ఫన్ని మూమెంట్స్ అందరికీ పెద్ద ఎత్తున నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. దీంతో అయాన్ భారీ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఇక అయాన్ నేడు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అయాన్ కి సంబంధించినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పుడే పదేళ్లు పూర్తి అయ్యాయి అంటూ ఈయన తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక అయాన్ కి సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే ఇతనిని అందరూ కూడా మోడల్ అయాన్ అని పిలుస్తూ ఉంటారు ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్ కూడా అల్లు అయాన్ మోడల్ అంటూ చెప్పిన సంగతి మనకు తెలిసిందే దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అయాన్ ఫన్నీ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మోడల్ అయాన్ హ్యాపీ బర్త్డే అంటూ కామెంట్ చేస్తున్నారు.

నువ్వు ఈ జనరేషన్లో తోపు నీలా ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎవరు లేరు అంటూ కొందరు కామెంట్లు చేయగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే నువ్వు పుట్టావు అంటూ అయాన్ కొన్ని ఫన్నీ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా అయాన్ కి సంబంధించిన కొన్ని వీడియోలను షేర్ చేస్తూ తన కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More: అజిత్ డైరెక్టర్ తో విజయ్ ఆఖరి సినిమా.. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ…!

ట్రెండింగ్ వార్తలు