April 3, 2024
తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. 2026 తమిళనాడు రాష్ట్ర ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారటానికి ప్లాన్ చేసుకున్నాడు విజయ్. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారటానికి ముందు ఒక సినిమా చేయాలనుకుంటున్నట్లు ప్రకటించాడు.
హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యారు విజయ్. ఈ సినిమా కోసం 250 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది, జూన్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సిహెచ్ వినోద్ దర్శకుడిగా అజిత్ తో ఎక్కువ సినిమాలు తీశారు తునివు, వాలిమై అంతకుముందు నేర్కొండ పార్వై సినిమాలు అజిత్ కలసి పని చేశారు.
ఇప్పుడు విజయ్ తో సినిమా అన్న వార్త విని అజిత్ దర్శకుడు తో విజయ్ సినిమా చేస్తున్నారా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రాజెక్టు ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని 2026 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఊపిరి అందించగలరని భావిస్తున్నారు. గత సంవత్సరం విజయ్ కి కొన్ని స్క్రిప్ట్లను వినిపించినట్లు ఆయనతో ఒక పొలిటికల్ సినిమాలు తీయాలని ఉంది అదే నా కోరిక.
నేను ఆయనకు చెప్పిన అన్ని స్క్రిప్ట్ లోని రాజకీయ కోణం ఉంటుంది అని వినోద్ గతంలోనే చెప్పారు. నిజానికి ఈ సినిమా కమల్ హాసన్ చేయవలసింది అయితే దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చేయడానికి కమల్ వెళ్లడంతో వినోద్ ఆ కథని విజయ్ వద్దకు తీసుకురావడం విజయ్ కి కథ నచ్చటంతో సినిమా పట్టాలెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా విజయ్ కి 69వ సినిమా కావటం విశేషం. ఈ సినిమాని తెలుగు నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాతో తన మేనిఫెస్టోని ప్రజలకు చేరువ చేసేలా, తన పార్టీకి ఉపయోగపడేలా ప్రజలకు సందేశాన్ని అందించాలని ఆలోచనలో ఉన్నాడంట విజయ్.
Read More: ఎప్పటికీ అతనే నా ఫేవరెట్ కో స్టార్.. మృణాల్ కామెంట్స్ వైరల్!