April 15, 2024
తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటుడు అమర్ దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సీరియల్స్ లో నటించి నటుడుగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న అమర్ దీప్ ఆ తర్వాత బిగ్బాస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. బిగ్బాస్ హౌస్ లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అవడంతో పాటు బోలెడంత పాపులారిటీని కూడా సంపాదించుకున్నాడు. అయితే చివర్లో గెలుస్తాడు అనుకున్న అమర్ రన్నరప్ గా నిలిచాడు.
బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒకవైపు సీరియల్లో మరొక సినిమాలతో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు అమర్. ఇది ఇలా ఉంటే తాజాగా అమర్ దీప్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న శబరి మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మే 3న విడుదల కానుంది. కాగా దీనికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అమర్ దీప్ చౌదరి పాల్గొన్నారు. ఆ సందర్భంగా అమర్ మాట్లాడుతూ.. మా కాలేజ్ డేస్ లో వరుణ్ సందేశ్ అన్న అంటే గుర్తొచ్చేది హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలు గుర్తొస్తాయి.
శశాంక్ అన్న అంటే సై సినిమా గుర్తుకు వస్తుంది. ఇక ఫణి గారి కామెడీ టైమింగ్ అదిరిపోతుంది అని అమర్ అన్నాడు. నేను చూసిన వరలక్ష్మి గారి మొదటి సినిమా తారై తప్పటి. ఆ సినిమా చూశాక ఏ హీరోయిన్ అయినా సరే ఇటువంటి పర్ఫార్మెన్స్ చేస్తారా అని అనుకున్నాను. నేను ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. అలా ఉంటుంది ఆమె నటన. ఆవిడ నటించిన శబరి పెద్ద హిట్ కావాలి అని కోరుకుంటున్నాను. నిర్మాత మహేంద్రనాథ్ గారిది గోల్డెన్ హార్ట్. ఇలా అందరూ చెబుతారు కానీ ఒకసారి ఆయనతో ట్రావెల్ చేసి చూస్తే తెలుస్తుంది. హడావిడిగా ఏది చేయరు. ప్రతీది చక్కగా చేసేంత వరకు టైం ఇస్తారు. శబరి టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు అమర్ దీప్.
Read More: నేను చచ్చిపోతా జగనన్న.. రాత్రంతా నిద్రలేదు.. ఎమోషనల్ అయిన శ్రీ రెడ్డి!