ఆ కోరికతో అనసూయ వద్దకు వెళ్తే చాలు అలా డీల్ చేస్తారా… క్యాస్టింగ్ కౌచ్ పై అనసూయ కామెంట్స్!

April 29, 2024

ఆ కోరికతో అనసూయ వద్దకు వెళ్తే చాలు అలా డీల్ చేస్తారా… క్యాస్టింగ్ కౌచ్ పై అనసూయ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ అనే కాదు ఏ రంగంలో అయినా కూడా మహిళలకు ఈ విధమైనటువంటి లైంగిక వేధింపులు ఎదురవుతూ ఉంటాయి అయితే అలాంటి వేధింపులు ఎదురవ్వాలి అంటే మన వ్యవహార శైలి ప్రవర్తన విధానం బట్టి ఉంటుందని అది పూర్తిగా వారి ఆలోచన ధోరణి పైన ఆధారపడి ఉంటుందని ఎంతోమంది తెలియచేశారు ఇక సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి.

ఇప్పటికే ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టుల నుంచి మొదలుకొని యాంకర్లు ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తాము కూడా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామంటూ బహిరంగంగా తెలియజేశారు. అయితే అనసూయ కూడా తాజాగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా అనసూయ మాట్లాడుతూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే మాట వాస్తవమని తెలియజేశారు. అయితే ఎవరైనా సినిమా కథ చెప్పాలి అంటూ తన వద్దకు వచ్చినప్పుడు వారు ఏ ఉద్దేశంతో అక్కడికి వచ్చారనే విషయం వారితో మాట్లాడుతున్నటువంటి మూడు నిమిషాలలోనే తెలిసిపోతుందని ఈమె తెలియజేశారు.

వారు నిజంగానే కథ చెప్పడానికి వచ్చారా లేకపోతే వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా అనే విషయాలను గ్రహించిన వెంటనే తాను తన భర్త పిల్లల గురించి మాట్లాడుతూ వారిని టాపిక్ డైవర్ట్ చేస్తానని ఈమె తెలియజేశారు. అయితే మనం ఇండస్ట్రీలో కొనసాగుతున్నాము. మన ప్రయాణం కొనసాగాలి అంటే ఇతరులతో గొడవకు వెళ్ళకూడదు.. వివాదాలకు దూరంగా ఉండటమే మంచిదని మరొకసారి వారు మనకి ఎదురైనప్పుడు ఆ సంఘటనలు గుర్తుకు రాకుండా ఉండాలి అంటే ఇలాంటి వాటిని పూర్తిగా మనం డైవర్ట్ చేయాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్భంగా అనసూయ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: జనసేన ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో మెగాస్టార్.. వార్ వన్ సైడే?

ట్రెండింగ్ వార్తలు