జనసేన ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో మెగాస్టార్.. వార్ వన్ సైడే?

April 29, 2024

జనసేన ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో మెగాస్టార్.. వార్ వన్ సైడే?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టారు ఈ క్రమంలోనే సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఎలాగైనా ఈసారి పవన్ కళ్యాణ్ గెలిచేలా అభిమానులు తన కుటుంబ సభ్యులు ఆరాటపడుతున్నారు.

ఇప్పటికే ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు పిఠాపురం వచ్చి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జబర్దస్త్ టీం మాత్రమే కాకుండా సీరియల్ నటీనటులు అలాగే నాగబాబు కొడుకు భార్యతో పాటు పలువురు సెలబ్రిటీలు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సైతం రాబోతున్నారని తెలుస్తుంది. ఈయన మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పిఠాపురంలో పర్యటన చేయబోతున్నట్టు సమాచారం. ఇలా తన తమ్ముడిని గెలిపించుకోవడం కోసం పెద్ద ఎత్తున మెగా కుటుంబ సభ్యులందరూ తనకు మద్దతుగా నిలబడ్డారని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారనే విషయం తెలిసి అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే చిరంజీవి తన సినిమా పనులన్నింటినీ కూడా పక్కన పెట్టుకొని ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఇక చిరంజీవి రంగంలోకి దిగబోతున్నారనే విషయం తెలీయాగానే పిఠాపురం గెలుపు పవన్ కళ్యాణ్ సొంతమైందని తెలుస్తుంది. అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినటువంటి చిరంజీవి తన పార్టీ తరఫున పిఠాపురం నుంచి ప్రస్తుత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి అయినటువంటి వంగా గీత ఇదే నియోజకవర్గ నుంచి గెలుపొందటం గమనార్హం.

Read More: ఏంట్రా జుట్టు ఇంత పెంచావు.. మహేష్ బాబుని ఆటపట్టించిన అక్క మంజుల!

ట్రెండింగ్ వార్తలు