April 15, 2024
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఇటీవల జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఖండిస్తున్నారు. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలో పాల్గొన్నటువంటి ఈయన ఈ బస్సు యాత్రకు ఊహించని విధంగా ఆదరణ రావడంతో ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ కుట్రలో భాగంగా విజయవాడలో జగన్మోహన్ రెడ్డి పై రాళ్లతో దాడి చేయగా ఆయన కంటి పై భాగంలో గాయం కాగా కుట్లు కూడా పడ్డాయి.
ఇక ఈ దాడిని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు ఈ క్రమంలోనే నటిగా యూట్యూబర్ గా వార్తలలో నిలిచే శ్రీ రెడ్డి సైతం ఈ ఘటనపై స్పందిస్తూ కామెంట్లు చేశారు. జగనన్న పై దాడికి పాల్పడినటువంటి వారికి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ దాడి వెనుక బోండా ఉమా హస్తము ఉందని ఈమె ఆరోపణలు చేశారు.ఎన్నో కోట్లమందికి ప్రాణమైన వ్యక్తిపై హత్యా యత్నం చేస్తారా? అసలు మీరంతా మనుషులేనా? ఒక మనిషికి హాని తలపెట్టేంత కోపమా మీకు. ఇంతమంది జనం వస్తున్నారని జీర్ణించుకోలేక ఇలాంటి పనులు చేస్తారా.
జగనన్న కోసం ఎంతమంది బ్రతుకుతున్నారో తెలుసా.. ఆయన ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో తెలుసా కేవలం మీ పదవుల కోసం ఒక మనిషి ప్రాణాలు తీయడానికి ఇలాంటి కుట్రలు చేస్తారా అంటూ మండిపడ్డారు. మేమంతా ఆయన పైనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నామని తెలిపారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేయడమే కాకుండా ఫేస్ బుక్ లోకూడా ఈమె స్పందించారు.
నేను చచ్చిపోతాను జగనన్న నేను బ్రతకలేను మీకు జరిగిన ఈ దాడి ఘటన తెలిసి రాత్రంతా నిద్ర కూడా రావడం లేదంటూ ఈమె తెలిపారు. మీరంటే అంత పిచ్చి మాకు అంటూ జగన్ దాడి ఘటన ఫొటోను షేర్ చేసింది శ్రీరెడ్డి. ఇప్పటికే ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తుంది పోలీస్ శాఖ. అయితే ఒక ముఖ్యమంత్రిపైనే ఇలా దాడి జరగడం నేషనల్ వైడ్‌గా సంచలనం రేపుతోంది. ఇక ఈ ఘటనపై ప్రధానమంత్రి కూడా స్పందించటం విశేషం.
Read More: సీక్రెట్ వెడ్డింగ్ పై ఘాటుగా రియాక్ట్ అయిన తాప్సీ.. నా పెళ్లి నా ఇష్టం అంటూ?