బాలీవుడ్ కల్చర్ కి అలవాటు పడ్డ తారక్.. భార్యను కూడా తీసుకెళ్లాడుగా?

April 29, 2024

బాలీవుడ్ కల్చర్ కి అలవాటు పడ్డ తారక్.. భార్యను కూడా తీసుకెళ్లాడుగా?

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సెలబ్రిటీలందరూ కూడా ఇలా ప్రైవేట్ పార్టీలకు హాజరవుతూ సందడి చేస్తూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి కల్చర్ కాస్త తక్కువే అని చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రిటీలు అందరూ కూడా తరచూ ఇలాంటి పార్టీలకు వెళ్లడం ఎంజాయ్ చేయడం చేస్తుంటారు అయితే ఇంత కల్చర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో లేదని చెప్పాలి.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలను కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ కూడా నటించబోతున్నారు. ఈ సినిమా పనుల నిమిత్తం ఎన్టీఆర్ తరచూ ముంబై కి వెళ్తున్నారు.

ఇలా గత కొద్దిరోజులుగా ముంబైలో ఉన్నటువంటి ఎన్టీఆర్ బాలీవుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడిపోయారని తెలుస్తుంది. ఈయన కూడా ముంబై వెళ్ళిన ప్రతిసారి అక్కడ సెలబ్రిటీలు ఇచ్చే పార్టీలకు వెళ్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నారు ఈ క్రమంలోనే సినీ స్టార్ సెలబ్రిటీలు నిర్వహించినటువంటి ఒక ప్రైవేట్ ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరయ్యారు అయితే ఈసారి తన భార్య లక్ష్మీ ప్రణతిని కూడా తీసుకెళ్లటం గమనార్హం. సాధారణంగా లక్ష్మీ ప్రణతి ఇలాంటి పార్టీలకు దూరంగా ఉంటారు. అలాంటిది ఈ ప్రైవేట్ పార్టీలో భాగంగా లక్ష్మీ ప్రణతి కూడా హాజరు కావడం విశేషం ప్రస్తుత ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ బాలీవుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More: పుష్ప సినిమాలో కేశవ పాత్రలో ఆ హీరో నటించాల్సి ఉండేదా.. అసలు విషయం చెప్పిన సుకుమార్!

ట్రెండింగ్ వార్తలు