ఏంట్రా జుట్టు ఇంత పెంచావు.. మహేష్ బాబుని ఆటపట్టించిన అక్క మంజుల!

April 29, 2024

ఏంట్రా జుట్టు ఇంత పెంచావు.. మహేష్ బాబుని ఆటపట్టించిన అక్క మంజుల!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. ఈయన ఇండస్ట్రీలోకి కృష్ణ వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా టాక్ పరంగా పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా కమర్షియల్ గా మాత్రం మంచి సక్సెస్ అందుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేశారని తెలుస్తుంది .త్వరలోనే పూజ కార్యక్రమాలను ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా అంటే ఈ సినిమా పై పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా పూర్తిగా తన లుక్ మార్చుకున్న విషయం తెలిసిందే.

పొడువాటి జుట్టుతో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు లుక్ గురించి తన అక్క మంజుల చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన రిలేటివ్స్ కి సంబంధించినటువంటి ఒక వెడ్డింగ్ ఈవెంట్ లో మహేష్ బాబు పాల్గొన్నారు. ఇదే వేడుకకు మహేష్ బాబు తన సోదరి మంజుల కూడా వచ్చారు. అయితే మహేష్ బాబును చూడగానే ఒకసారిగా ఈమె తన జుట్టు పట్టుకొని ఏంట్రా నీ జుట్టు ఇంత పెంచావ్ అంటూ మాట్లాడినట్టు తెలుస్తుంది ఇలా సరదాగా అక్క తమ్ముళ్ల మధ్య జరిగినటువంటి ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: బాలీవుడ్ కల్చర్ కి అలవాటు పడ్డ తారక్.. భార్యను కూడా తీసుకెళ్లాడుగా?

Related News

ట్రెండింగ్ వార్తలు