డాన్సింగ్ పార్ట్నర్ అంటూ తనతో కలిసి డాన్స్ ఇరగదీసిన రేణు దేశాయ్.. వీడియో వైరల్!

April 29, 2024

డాన్సింగ్ పార్ట్నర్ అంటూ తనతో కలిసి డాన్స్ ఇరగదీసిన రేణు దేశాయ్.. వీడియో వైరల్!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా తనకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా విడాకులు తీసుకున్నటువంటి ఈమె అనంతరం తన ఇద్దరు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు.

తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ వారిని ఉన్నత చదువులు చదివిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తన ఇద్దరు పిల్లలకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తాను చేసినటువంటి డ్యాన్స్ కి సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు.

ఇక ఈ వీడియోని షేర్ చేసిన రేణు దేశాయ్ నా ఫేవరేట్ డ్యాన్సింగ్ పార్ట్నర్.. మనకు ఇష్టమైన వారితో డాన్స్ చేస్తే థెరపీలా పనిచేస్తుందంటూ రాసుకొచ్చారు. మరి ఈమె డాన్సింగ్ పార్ట్నర్ ఎవరు అనే విషయానికి వస్తే తను మరెవరో కాదు. రేణు దేశాయ్ కుమార్తె ఆద్య అని చెప్పాలి. ఇక ఆధ్యతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉన్నటువంటి ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎంతోమంది వామ్మో ఆధ్య ఏంటీ ఇంత పెద్దగా మారిపోయింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆధ్యా ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Read More: ఆ కోరికతో అనసూయ వద్దకు వెళ్తే చాలు అలా డీల్ చేస్తారా… క్యాస్టింగ్ కౌచ్ పై అనసూయ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు