ప్రచార కార్యక్రమాలకు యాంకర్ శ్యామల.. ఆ ఎమ్మెల్యేకు మద్దతుగా ప్రచారం!

April 29, 2024

ప్రచార కార్యక్రమాలకు యాంకర్ శ్యామల.. ఆ ఎమ్మెల్యేకు మద్దతుగా ప్రచారం!

ఏపీ ఎలక్షన్స్ మరొక రెండు వారాలలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే అన్ని పార్టీ అధినేతలు కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా సినీ సెలెబ్రెటీలు కూడా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి శ్యామల సైతం వైసీపీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.

గత ఎన్నికల సమయంలోనే వైసీపీ పార్టీలోకి యాంకర్ శ్యామల తన భర్త నరసింహారెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు ఈ క్రమంలోనే ఈమె భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావుకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఈమె మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు.

ఇలా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి శ్యామల 2019లో నేను వైసీపీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక మొదట ప్రచారం చేసింది శ్రీనివాసరావు గారికే. అప్పుడు మహిళలతో పెద్ద ఎత్తున ప్రచారం చేశాను. అవంతి గారిని గెలిపించారు. అన్న మాట ప్రకారం జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తూ.. మీరు ప్రయోజనం పొందితేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెబుతున్నారు. మనం ఓటు వేసిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు మన భవిష్యత్తును నిర్ణయించుకొని ఓటు వేయాలి అందుకే ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించాలని ఈమె తెలిపారు.

ఎన్నికల ముందు ఇచ్చిన మాట పై నిలబడే వ్యక్తి మనకు కావాలా లేకపోతే ఓట్ల కోసం మాయమాటలు చెప్పి తర్వాత ఆ మాటలను మరిచిపోయే వ్యక్తి కావాలా అనే విషయాన్ని ఆలోచించుకొని ఓటు వేయాలంటూ ఈమె తెలిపారు.ఇవాళ ఇక్కడ వైఎస్సార్ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు నాయకులు వచ్చారని కాకుండా కుటుంబ సభ్యులు వచ్చారని మమ్మల్ని ఆదరిస్తున్నారనీ శ్యామల తెలిపారు.

Read More: డాన్సింగ్ పార్ట్నర్ అంటూ తనతో కలిసి డాన్స్ ఇరగదీసిన రేణు దేశాయ్.. వీడియో వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు