యానీ మాస్టర్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. డాన్స్ చేస్తూ అలా?

April 23, 2024

యానీ మాస్టర్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. డాన్స్ చేస్తూ అలా?

తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ అయిన యానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి లేడి కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు కొరియోగ్రాఫర్లుగా మగవారు ఎక్కువగా వ్యవహరిస్తున్నారు. ఫిమేల్ కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉన్నారు. అటువంటి వాటిలో యానీ మాస్టర్ కూడా ఒకరు. అలాగే ఈమె ఢీ,జబర్దస్త్ ఇలాంటి షోలకు జడ్జిగా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

యాని మాస్టర్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆమె డాన్స్ అంటే తెగ ఇష్టపడే అభిమానులు చాలామంది ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా యానీ మాస్టర్ ప్రమాదానికి గురయ్యారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగిందంటే.. యానీ మాస్టర్ తన అసిస్టెంట్ లతో కలిసి చేసే రీల్ వీడియోలు, వేసే స్టెప్పులు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంటాయి. ఇక సితారకు డ్యాన్సుల్లో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంటుంది యానీ మాస్టర్. సితార, యానీ మాస్టర్లు కలిసి చేసిన డ్యాన్స్ వీడియోలు, రిహార్సల్ చేసిన వీడియోలు బాగానే ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా యానీ మాస్టర్ ఒక రీల్ చేయాలని ప్రయత్నించింది. వర్షంలో చేసిన ఈ రీల్ వీడియో బెడిసి కొట్టేసింది. రీల్ కోసం డ్యాన్స్ చేస్తూ చేస్తూ చివరకు కాలి జారి ముందుకు పడింది. దీంతో ఆమె మొహానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. యానీ మాస్టర్ అలా ఒక్కసారిగా జారి పడటంతో అభిమానులు ఆందోళన చెందారు. యానీ మాస్టర్‌కు ఏమై ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు. అయితే తాను క్షేమంగానే ఉన్నానని, ఏమీ కాలేదని యానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చింది. తన మీద ఇంత ప్రేమను చూపించిన అభిమానులకు థాంక్స్ అని చెప్పుకొచ్చింది. అయితే యాని మాస్టర్ కింద పడిన సమయంలో ఆమె నేలపై బలంగా పడడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు.

Read More: టార్చర్ భరించలేక జబర్దస్త్ కు దూరమయ్యా.. ఎట్టకేలకు ఓపెన్ అయిన ఆది!

Related News

ట్రెండింగ్ వార్తలు