April 23, 2024
జబర్దస్త్ కార్యక్రమాల ద్వారా కమెడీయన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హైపర్ ఆది ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా స్టార్ సెలబ్రెటీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆది ఈ కార్యక్రమము నుంచి తప్పుకున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న ఈయన ఇతర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అలాగే సినిమాలో కూడా చేస్తున్నారు. అయితే జబర్దస్త్ నుంచి మాత్రమే దూరం కావడానికి గల కారణమేంటి అనే సందేహం అందరిలోనూ కలిగింది. ఇక తాను జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆది వెల్లడించారు. తాను జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి కారణం మరేదిలేదని కేవలం సినిమాలు మాత్రమేనని తెలిపారు.
జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగాలి అంటే ఆ కార్యక్రమంలో ఒక స్కిట్ చేయడానికి స్క్రిప్ట్ నేనే రాసుకోవాల్సి ఉంటుంది. స్క్రిప్ట్ కోసం రెండు మూడు రోజులు సమయం గడపాలి. మళ్ళీ దాని ప్రాక్టీస్ కోసం కూడా ఎక్కువ సమయం కేటాయించాలి.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగాలి అంటే తాను సినిమాలలో నటించడానికి ఏమాత్రం వీలు కావడం లేదని తెలిపారు. జబర్దస్త్ లో ఉండడం అంటే మరో ప్రపంచాన్ని చూడలేమని అందుకే మానుకున్నాను అని తెలిపారు..
ఇక ఈ కార్యక్రమం కోసం స్క్రిప్ట్ రాయడం అనేది పెద్ద టార్చర్ అంటూ ఆది తెలిపారు. ఆ టార్చర్ భరించలేక తాను ఈ కార్యక్రమానికి దూరమయ్యానని ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడంతో తాను సినిమాలలో కూడా నటించగలుగుతున్నాను అంటూ ఆది జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు రావడానికి గల కారణాలను ఈ సందర్భంగా తెలియజేశారు.
Read More: మరోసారి అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన శ్రద్ధా దాస్.. అందంతో పిచ్చెక్కిస్తోందిగా?