భజే వాయు వేగం మూవీ మేకర్స్ పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్.. నా తమ్ముడు లాంటివాడు అంటూ!

April 22, 2024

భజే వాయు వేగం మూవీ మేకర్స్ పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్.. నా తమ్ముడు లాంటివాడు అంటూ!

టాలీవుడ్ హీరో కార్తికేయ గురించి మనందరికీ తెలిసిందే. కార్తికేయ తెలుగులో ఆర్ఎక్స్ 100, చావు కబురు చల్లగా, గుణ 369 లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కార్తికేయ. హీరో కార్తికేయ మెగా అభిమాని అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిరునీ అభిమానించే వారిలో కార్తికేయ కూడా ఒకరు. చాలా ఈవెంట్లో పలు సందర్భాలలో మెగా సార్ పై తనకున్న అభిమానం గురించి బయట పెట్టారు హీరో కార్తికేయ.

చిరు డ్యాన్సులు, యాక్షన్ చూస్తూ పెరిగిన కార్తికేయమెగాస్టార్‌కు వీరాభిమానిగా మారిపోయాడు. అందుకే తన అభిమాన హీరో చేతుల మీదుగా తన మూవీ టీజర్ లాంచ్ అవ్వడంతో ఫుల్ ఖుషీ అవుతున్నాడు. కార్తికేయ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన భజే వాయు వేగం మూవీ టీజర్‌ను శనివారం రోజు విశ్వంభర సెట్‌లో చిరంజీవి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. యూవీ కాన్సెప్ట్స్‌లో విక్కీ నిర్మాతగా, దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చంద్రపు రూపొందించిన భజే వాయు వేగం టీజర్, టైటిల్ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉన్నాయని అన్నారు మెగాస్టార్. . తన అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇదని చెప్పుకొచ్చాడు.

తన అభిమాని హీరోగా ఒక మంచి సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అని అన్నారు మెగాస్టార్. అలాగే ప్రశాంత్ రెడ్డి లాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ టాలీవుడ్‌లోకి రావాలని, అలాంటి వాళ్లు వచ్చినప్పుడే కొత్త కథలు వస్తాయని, కొత్త కాన్సెప్ట్స్‌తో వస్తే అంత ఫ్రెష్‌గా మన ఫిలిం ఇండస్ట్రీ ముందుకు సాగుతుందని అన్నారు. యంగ్ డైరెక్టర్స్‌ని తాను ఎప్పుడూ ఆహ్వానిస్తుంటానని తెలిపారు. భజే వాయు వేగం సినిమా టీజర్ చూస్తుంటే తండ్రీ కొడుకు మధ్య మంచి ఎమోషన్‌తో సాగే సినిమా అనిపిస్తోందని లీక్ చేయబోయాడు చిరు. టీజర్‌లో యాక్షన్ బాగుందని, ఈ సినిమా స్టోరీ తనకు తెలిసినా ఇంతకంటే ఎక్కువ లీక్ చేయాలనుకోవడం లేదని అన్నారు మెగాస్టార్.

Read More: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ రష్మీ.. ఇప్పుడు అతనే అంటూ!

ట్రెండింగ్ వార్తలు