త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ రష్మీ.. ఇప్పుడు అతనే అంటూ!

April 22, 2024

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ రష్మీ.. ఇప్పుడు అతనే అంటూ!

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలతో పాటు పలు పండుగ ఈవెంట్లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది. సినిమాలు అనుకున్న విధంగా రష్మికి కలిసి రాలేదు. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటో షూట్స్ తో యువతకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే రష్మీ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న శుభవార్త రష్మీ పెళ్లి ఎప్పుడు. రష్మి పెళ్లి కోసం పెళ్లి శుభవార్త కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈమె సుధీర్ తో ప్రేమలో ఉందని వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు అంటూ ఎన్నోసార్లు వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ అవాస్తవాలు గానే మిగిలిపోయాయి. దీంతో రష్మీకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ షోలో అయినా కూడా పెళ్లికి సంబంధించిన వార్తలు ఎదురవుతూనే ఉంటాయి. ఇకపోతే రష్మి త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు ఒక వార్త ఎప్పటినుంచో వైరల్ అవుతోన్నసంగతి తెలిసిందే. ఈ భామ ఒడిసాకు చెందిన ఒక యువ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంటున్నట్లు టాక్ నడిచింది.

ఇక త్వరలో ఈ విషయంలో ఒక ప్రకటన రానుందని టాక్. ఈ క్రమంలో ఈ బ్యూటీ కాస్తా ఫిట్ నె‌స్ పై శ్రద్ద చూపడంతో ఇప్పటికే సన్నగా ఉండే ఈ బ్యూటీ ఇక మరింతగా చిక్కిపోయింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రష్మీ పెళ్లి వార్తలు ప్రతీసారి కూడా అభిమానులకు నిరాశ పరుస్తుండటంతో అసలు రష్మీ పెళ్లి చేసుకుంటుందా లేదా అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Read More: ఆ విషయంలో సమంత మహేష్ బాబు అల్లు అర్జున్ కంటే తోపా.. రికార్డు బద్దలు కొట్టిందిగా!

ట్రెండింగ్ వార్తలు