గోపీచంద్ భీమా రివ్యూ అండ్ రేటింగ్!

March 8, 2024

భీమా

భీమా

  • Cast : గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, నరేష్, పూర్ణ, నాసర్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు
  • Director : ఏ హర్ష
  • Producer : కేకే రాధామోహన్
  • Banner : శ్రీ సత్యసాయి ఆర్ట్స్
  • Music : రవి బస్రూర్

2.5 / 5

గోపీచంద్ ఇటీవల కాలంలో పెద్దగా సక్సెస్ అందుకోలేదు అయితే తాజాగా ఈయన భీమ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా నేడు మార్చి 8 2024న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి నేను విడుదలైనటువంటి ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయానికి వస్తే..

కథ: భీమా (గోపీచంద్) తనదైన స్టైల్ లో క్రిమినల్స్ ని పట్టుకుని వారి ఆట కట్టించే పోలీస్ అధికారిగా కనిపిస్తారు అయితే మహేంద్రగిరి భవాని (ముకేశ్ తివారి) అనే రౌడీషీటర్ పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తుంటారు ఈయనకి ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చంపేయడమే తన లక్ష్యం అలా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సై చనిపోవడంతో ఆయన స్థానంలో భీమా మహేంద్రగిరి వెళ్తారు. ఇలా వెళ్లడంతోనే భావానికి తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తారు. ఇలా పోలీస్ అధికారిగా కొనసాగుతూ ఈయన స్కూల్ టీచర్ గా పని చేస్తున్న విద్య (మాళవిక శర్మ)తో ప్రేమలో పడతారు.రవీంద్ర వర్మ (నాజర్) అంటే విద్యకు అమితమైన గౌరవం ఉంటుంది. అనంతరం భీమాని రవీంద్ర వర్మ ఒక పనిచేయమని కోరతాడు. అదే పలు పరిస్థితులకు కారణమవుతుంది. ఇంతకీ భీమాని రవీంద్ర వర్మ కోరింది ఏంటి. భవానికి భీమాకి మధ్య ఏమి జరిగింది, రవీంద్ర వర్మ అప్పగించిన పనితో భీమా ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథ.

విశ్లేషణ: ఈ సినిమాలో ఈయన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు ఇందులో యాక్షన్ సన్నీ వేషాలు సినిమాకి హైలెట్ అయ్యాయని చెప్పాలి ముఖ్యంగా పరశురామ క్షేత్రంలో జరిగే సన్నివేశాలు సూపర్ గా ఉన్నాయి ఇక చివర అరగంట క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి ఇక మొదటి హాఫ్ కాస్త స్లోగా సాగిన సెకండ్ హాఫ్ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇక యాక్షన్స్ అన్ని వేషాలు మాత్రమే కాకుండా అక్కడక్కడ కామెడీ రొమాంటిక్ సన్నివేశాలను కూడా చేర్చారు మొత్తానికి గోపీచంద్ కటౌట్ కి సరిగ్గా సరిపోయే సినిమా అని చెప్పాలి.

నటీనటుల నటన: పోలీస్ ఆఫీసర్ పాత్రలో భీమాగా గోపీచంద్ ఎంతో అద్భుతంగా నటించారు. ఈయన యాక్షన్స్ సన్ని వేషాలు మాత్రమే కాకుండా కామెడీ సీన్స్ కూడా అద్భుతంగా చేశారు. ఇక మాళవిక శర్మ నాజర్ ప్రియాంక భవాని శంకర్ వంటి తదితరులు అందరూ కూడా వారి పాత్రలకు అనుగుణంగా వారి పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

బాటమ్ లైన్: చాలా రోజుల తర్వాత గోపీచంద్ కి మంచి హిట్ పడిందని చెప్పాలి ఈ సినిమా ఒకవైపు కామెడీ నేపథ్యంలోనే మరోవైపు యాక్షన్ సీక్వెన్స్ గా ప్రేక్షకులను భారీ స్థాయిలో మెప్పించింది అని చెప్పాలి.

Read More: అపోలో హాస్పిటల్లో చేరిన స్టార్ హీరో అజిత్.. ఆందోళనలో అభిమానులు?

ట్రెండింగ్ వార్తలు