పూనమ్ క్యాన్సర్ కు బ్రాండ్ అంబాసిడర్ కాదు.. సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం!

February 8, 2024

పూనమ్ క్యాన్సర్ కు బ్రాండ్ అంబాసిడర్ కాదు.. సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం!

బాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి పూనమ్ పాండే తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలుస్తూ ఉంటారు . ఇటీవల ఈమె మరోసారి వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. పూనమ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు. 32 సంవత్సరాల వయసులోనే తాను గర్భాశయ క్యాన్సర్ ద్వారా మరణించాను అంటూ చెప్పకు వచ్చారు.

ఈ పోస్టు స్వయంగా ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఇది నిజమేనని అందరూ భావించారు. దీంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలో సోషల్ మీడియా వేదికగా ఈమె మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు. దీంతో ఈ వార్త కాస్త మీడియా వార్తలలో కూడా వైరల్ గా మారింది. ఇలా ఈమె చనిపోయింది అంటూ సోషల్ మీడియాలోనూ ఇటు మీడియా ఛానల్లోను పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో చివరికి పూనమ్ స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.

తాను చనిపోయాను అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని, నేను బ్రతికే ఉన్నానని ఈమె తెలియజేశారు. ఇక తాను గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు చెప్పడానికి కారణం లేకపోలేదని తెలిపారు. తాను గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం కోసమే ఇలా పోస్ట్ చేశానని చెప్పుకోవచ్చారు అయితే ఈమె వ్యవహార శైలిపై ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఈమె వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూనమ్ పాండేను ప్రభుత్వం క్యాన్సర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మార్చవచ్చు అనే వార్తలు వస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ వార్తలపై స్పందిస్తూ తనని ఎలాంటి క్యాన్సర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించలేదు అంటూ ఈ వార్తలను ఖండించేశారు. మొత్తానికి ఈమె సోషల్ మీడియాలో ఇలా అటెన్షన్ పొందడం కోసం పాపులారిటీ సంపాదించుకోవడం కోసమే ఇలాంటి పోస్ట్ చేశారు అంటూ పలువురు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More: నల్లమల అడవి.. నల్ల చీర అంటూ అంచనాలను పెంచిన టిల్లు!

ట్రెండింగ్ వార్తలు