నల్లమల అడవి.. నల్ల చీర అంటూ అంచనాలను పెంచిన టిల్లు!

February 8, 2024

నల్లమల అడవి.. నల్ల చీర అంటూ అంచనాలను పెంచిన టిల్లు!

సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ పలు సినిమాలలో నటించిన సిద్దు జొన్నలగడ్డ ఇటీవల కాలంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈయన డీజే టిల్లు అనే సినిమాలో చేసిన అనంతరం ఈయనకు మరింత పేరు ప్రఖ్యాతలు వచ్చాయని చెప్పాలి. ఈ సినిమాలో ఈయన మాట తీరు తను చెప్పే డైలాగ్స్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ చిత్రంగా టిల్లు స్క్వేర్ అనే పేరిట ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో నేహా శర్మ కాకుండా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఫిబ్రవరి 7వ తేదీ సిద్దు జొన్నలగడ్డ పుట్టిన రోజు కావడంతో ఆయన పుట్టిన రోజున పురస్కరించుకొని ఈ సినిమా నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో టిల్లు కారు న‌డుపుతండ‌గా వెన‌కాల కూర్చున వ్యక్తి సిద్దుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగా పక్కనే కూర్చున్నటువంటి అనుపమ పరమేశ్వరన్ సారీ చెబుతూ తనకు ముద్దు పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా లాస్ట్ ఇయ‌ర్ నీ పుట్టిన‌రోజు ఎలా జ‌రిగిందని అడుగుతుంది. ఈక్ర‌మంలో టిల్లు లాస్ట్ ఇయ‌ర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రాధిక‌తో క‌లిసి చేసిన వ్య‌వ‌హారాల‌ను గుర్తు చేశారు.

లాస్ట్ ఇయర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ అంతా కలిసే నల్లమల అడవులలో ఓ నల్ల చీర ఫిల్మ్ బై రాధిక అనే ఓ సినిమా చూశామ‌ని రాధిక అనే పెద్ద డైరెక్ట‌ర్ ఆ సినిమా తీసింద‌ని, ఆమె క‌థ‌లు చాలా చెబుతుందని, సినిమా అన్ని ర‌కాల జాన‌ర్‌లో ఉంటుంద‌ని, అది ఓటీటీటీ సినిమా అని, పాన్ మ‌ల్కాజిగిరి అంటూ రాధికతో జరిగిన సన్నివేశాలన్నింటినీ కూడా తిరిగి చూపించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: ఓటీటీలోకి ఈరోజు ఏకంగా అన్ని సినిమాలు.. కానీ ఆ మూడు సినిమాలే స్పెషల్!

ట్రెండింగ్ వార్తలు