August 28, 2022
‘ఎఫ్3’ రిలీజ్ తర్వాత తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు వెంకటేశ్. వెంకీ సినిమా చేసే దర్శకుడు ఇతడేనంటూ రోజుకో దర్శకుడి పేరు తెరపైకి వస్తుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ పేరు ఎప్పట్నుంచో వినిపిస్తుంది. ఇక రీసెంట్ టైమ్స్‌లో తరుణ్ భాస్కర్, కేవీ అనుదీప్ పేర్లు వినిపించాయి. లేటెస్ట్‌గా శివ నిర్వాణ పేరు తెరపైకి వచ్చింది. అందుకూ వెంకీకి టూకీగా కథలు చెప్పారు. కానీ వెంకీ మాత్రం ఏ కథను సెలక్ట్ చేసుకోవాలా? అనే అయోమయంలో ఉన్నారు.
ఇటు వెంకీ సమకాలికులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వరుస సినిమాలతో ముందుకు వెళ్తుంటే వెంకీ మాత్రం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరి..ఫైనల్‌గా వెంకీ హీరోగా ఏ దర్శకుడి కథతో సినిమా తెరకెక్కనుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హట్ టాపిక్. ఈ టాపిక్‌కు వీలైనంత తొందరగా తెరదించాలని వెంకీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి..ఏం జరుగుతుందనేది చూడాలి.
ప్రస్తుతం ‘ఎఫ్ 3’ కంటే ముందే సైన్ చేసిన సల్మాన్‌ఖాన్ హిందీ చిత్రం, విశ్వక్‌సేన్ ‘ఓరి దేవుడా’ చిత్రాల్లో కీ రోల్స్ చేస్తున్నారు వెంకీ. ఇక వెంకటేశ్, రానా చేసిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.