ఘ‌నంగా వెంక‌టేష్ రెండో కుమార్తె నిశ్చితార్థ వేడుక..హాజ‌రైన సినీ ప్ర‌ముఖులు

October 26, 2023

ఘ‌నంగా వెంక‌టేష్ రెండో కుమార్తె నిశ్చితార్థ వేడుక..హాజ‌రైన సినీ ప్ర‌ముఖులు

ద‌గ్గుబాటి ఇంట కూడా పెళ్లి సందడి మొదలైంది. అతి త్వ‌ర‌లో విక్ట‌రి వెంక‌టేష్- నీరజల రెండో కూతురు హయవాహిని పెళ్లి పీటలెక్కనుందంటూ ఇటీవ‌ల‌ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.. తాజాగా అదే నిజమైంది. బుధవారం రాత్రి హవ్యవాహిని నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, రానా, నాగ‌చైత‌న‌న్య‌ సహా పలువురు సెలబ్రిటీలు హాజర‌య్యారు.

మొదటి నుంచి వెంక‌టేష్ సోషల్‌ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. తన ఫ్యామిలీ వ్యవహారాలను ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడతాడు. అందుకే ఇప్పుడు తన కూతురి ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని సైతం మీడియాకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డార‌ని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విజయవాడకు చెందిన డాక్టర్‌ ఫ్యామిలీతో వియ్యం అందుకుంటున్న వెంకటేశ్‌ వచ్చే ఏడాది మార్చిలో కూతురి వివాహం జరిపించనున్నట్లు తెలుస్తోంది.

వెంకీ మామ ప్రస్తుతం త‌న కెరీర్‌లో 75వ చిత్రంగా సైంధవ్‌ సినిమా చేస్తున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది.

Read More: వంద‌కోట్ల సినిమాల‌తో బాల‌య్య రికార్డులు..

ట్రెండింగ్ వార్తలు