ఇంకెన్ని రోజులు ఇలా చేస్తార్రా..మల్లెమాల, ఢీ టీంను ఆడేసుకుంటున్న నెటిజన్లు

December 24, 2023

ఇంకెన్ని రోజులు ఇలా చేస్తార్రా..మల్లెమాల, ఢీ టీంను ఆడేసుకుంటున్న నెటిజన్లు

Dhee Celebrity Special: తెలుగు సినీ ప్రేక్షకులకు ఈటీవీ మల్లెమాల(MalleMaala)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మల్లెమాల ఇప్పటికి ఎన్నో రకాల షోలను ఈటీవీలో ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్,ఢీ, క్యాష్ దొరికినంత దోచుకో, ఆలీతో సరదాగా ఇలా ఎన్నో రకాల షోలు చేస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. విటితో పాటుగా అప్పుడప్పుడు పండుగ ఈవెంట్లు కూడా నిర్వహిస్తూ ఉంటుంది మల్లెమాల.

ఇకపోతే మల్లెమాల నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో ఢీ కూడ ఒకటి. ఇప్పటికే ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఈ ఢీషో తాజాగా మరో సరికొత్త సీజన్(Dhee Celebrity Special)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అందుకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా అందులో శేఖర్ మాస్టర్ కి యాంకర్ శివ మీద ఎవడ్రా వీడిని పిలిచింది అన్నట్టుగా సీరియస్ అయినట్టు ప్రోమోని వదిలారు. అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ నెగిటివ్ గా కామెంట్ చేస్తూ మల్లెమాల ఢీ టీం లను ఒక ఆట ఆడుకుంటున్నారు.

ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తారు. ప్రోమోలో కొట్లాడుతున్నట్టు చూపించడం తీరా షో చూసినప్పుడు అందులో ఏమీ లేకపోవడం ఇవన్నీ ఎప్పటినుంచో జరుగుతున్నాయి. ఇలా పదేపదే చేయడం మీకు బోరింగ్ గా అనిపించడం లేదా అంటూ మండిపడుతున్నారు. మీరు ఇలాంటి సీరియస్ ప్రోమోలు ఎన్ని వదిలా కూడా మేము నమ్మము. గతంలో ఇలాంటి ప్రోమోలు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఢీ షోలో చూసాము.

ఇలాంటివి నమ్మి మేము మళ్ళీ మళ్ళీ బకరాలు కావాలి అనుకోవడం లేదు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మల్లెమాల ఈ విధంగా సీరియస్ ప్రోమోలను షేర్ చేయడం తగ్గిస్తుందో లేదో చూడాలి మరి

Read Moreఎవడ్రా వీడ్ని తీసుకొచ్చింది..యాంకర్ శివ పరువుతీసిన శేఖర్ మాస్టర్

ట్రెండింగ్ వార్తలు