అర్ధ‌రాత్రి న‌డిరోడ్డుపై యాంకర్ రవి హ‌ల్‌చ‌ల్‌..?

January 1, 2024

అర్ధ‌రాత్రి న‌డిరోడ్డుపై యాంకర్ రవి హ‌ల్‌చ‌ల్‌..?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో షోలకు యాంకరింగ్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు యాంకర్ రవి (Anchor Ravi). పటాస్, అదిరింది ఇలాంటి షోలకు యాంకర్ గా వ్యవహరించడంతో పాటు బుల్లితెరపై ప్రసారమైన పలు పండుగ ఈవెంట్లలో కూడా చేరి సందడి చేసి తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

బుల్లి తెరపేక్షకులతో పాటు కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను కూడా అలరించారు. ఇక బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు యాంకర్ రవి. అయితే ఈ మధ్యకాలంలో యాంకర్ రవి జోష్ చాలా వరకు తగ్గిపోయిందని చెప్పొచ్చు.

సొంత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ అభిమానులకు చేరువగా ఉన్నాడు. మరి ముఖ్యంగా సోష‌ల్‌ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటించడంతో పాటుగా తన భార్య, కూతురికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తన భార్య కూతురితో కలిసి న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు రవి(Anchor Ravi).

ఆ వీడియోలో తన కూతురు భార్యతో కలిసి అర్ధరాత్రి నడిరోడ్డుపై కేక్ కట్ చేస్తూ న్యూ ఇయర్ కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడంతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో షేర్ చేయడంతో రవి అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున న్యూ ఇయర్ విషెస్ ని చెబుతున్నారు. కొంత మంది మాత్రం అర్ధ‌రాత్రి ఇంట్లో కాకుండా రోడ్డుపై న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఏంటి అని నెగ‌టివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మ‌రి మీ స్పంద‌న ఏంటో కామెంట్ ద్వారా తెలియ‌జేయండి.

Read Moreథైస్ షో చేస్తున్న సమంత.. లేటెస్ట్ పిక్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు