ఎవడ్రా వీడ్ని తీసుకొచ్చింది..యాంకర్ శివ పరువుతీసిన శేఖర్ మాస్టర్

December 24, 2023

ఎవడ్రా వీడ్ని తీసుకొచ్చింది..యాంకర్ శివ పరువుతీసిన శేఖర్ మాస్టర్

తెలుగు సినీ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్ కమ్ డాన్సర్ శేఖర్ మాస్టర్(Shekar Master)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాలలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు. ఎప్పుడూ అందర్నీ నవ్విస్తూ అందరిపై పంచులు వేసే శేఖర్ మాస్టర్ తాజాగా మొదటిసారి సోలో సీరియస్ అవ్వడంతో పాటు షో నుంచి బయటికి వెళ్లిపోయారు..

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముంది అన్న విషయానికొస్తే.. ఇటీవల సెలబ్రిటీ డాన్స్ షో ఒకటి ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో బుల్లితెరపై నటించి మెప్పించిన ఎంతోమంది నటీమణులు డాన్స్ చేసి అదరగొట్టారు. కాగా ఆ ప్రోమోలో నందు యాంకర్ గా వ్యవహారిస్తున్నాడు. ఇక ఈ షోలో పలువురు సెలబ్రెటీలు డ్యాన్స్ పెర్మామెన్స్ ఇచ్చారు. ఇక వారికి శేఖర్ మాస్టర్ తనదైన శైలిలో వారి డ్యాన్స్ ఫెర్మామెన్స్ పై కామెంట్స్ చేశారు. ఆ షోలో శేఖర్ మాస్టర్ తో పాటు టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది.

ఇక హ్యాపీగా సాగుతున్న ఈ ప్రోమోలో యాంకర్ శివ(Anchor Shiva)చేసిన కామెంట్స్ తో హీటెక్కింది. శివ రావడంతోనే శేఖర్ మాస్టర్ ను ఒకటి అడగాలి అంటూ నోరు జారాడు. మీకు ఒక హీరోయిన్ కు ఎఫైర్ ఉందని బయట రూమర్స్ నడుస్తున్నాయని యాంకర్ శివ అడుగుతాడు. దీంతో శేఖర్ మాస్టర్ సిరీయస్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్… నాకు ఓ ఫ్యామిలీ ఉంది. పిల్లలు ఉన్నారు అంటూ ఫుల్ ఫైర్ అవుతాడు(Shekar Master Fires On Anchor Shiva). ఎవడ్రా వీడిని తీసుకువచ్చిందని మండిపడుతాడు శేఖర్ మాస్టర్. ఆ మాటలకు షోలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయ్యారు. వాడిని పంపిస్తారా లేదా నన్ను వెళ్లిపోమ్మంటారా అంటూ శేఖర్ మాస్టర్ ఫైర్ అవుతాడు. ఇక యాంకర్ శివ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడ శేఖర్ మాస్టర్ వినకుండా షో నుంచి బయటకు వెళ్లిపోతాడు. దీంతో సెట్లోని వారంతా షాక్ అవుతారు. పక్కనే ఉన్న ప్రణతి కూడా షాక్ లో ఉండిపోతుంది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కొంతమంది ఇదంతా కేవలం ప్రోమో కోసమే ఇలాంటివి మేము ఎన్ని చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Read More:Malavika Mohanan: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తోన్న మాళవిక మోహనన్ 

ట్రెండింగ్ వార్తలు