చిరంజీవి స్టాలిన్ పోస్టర్ ను కాపీ కొట్టిన ప్రశాంత్ వర్మ.. అద్భుతం సృష్టించాడుగా?

May 6, 2024

చిరంజీవి స్టాలిన్ పోస్టర్ ను కాపీ కొట్టిన ప్రశాంత్ వర్మ.. అద్భుతం సృష్టించాడుగా?

ప్రశాంత్ వర్మ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన ఇటీవల హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా చేశారు తాజాగా హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది.

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది. మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని చేసే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

జై హనుమాన్ పేరిట హనుమాన్ సినిమా సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలోని ఆంజనేయ స్వామి విగ్రహం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఆంజనేయస్వామి విగ్రహం చేతులు కట్టుకొని చాలా గంభీరంగా ఉన్నట్టు కనిపిస్తారు అయితే అలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించాలనే ఆలోచన చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా చూసిన తర్వాత వచ్చిందని తెలిపారు..

చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో కూడా ఆయన అదే విధంగా చేతులు కట్టుకుని చాలా గంభీరంగా చూస్తూ కనిపిస్తారు. పోస్టర్ తోనే తాను హనుమాన్ విగ్రహాన్ని కూడా క్రియేట్ చేశాను అంటూ ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ఆంజనేయస్వామి విగ్రహాన్ని క్రియేట్ చేయడం వెనుక ఉన్నటువంటి అసలు విషయాన్నీ తెలియచేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసినటువంటి చిరు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: మహేష్ అంటే నమ్రత భర్తగా మాత్రమే తెలుసు.. రానా కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు