మెగా హీరోలతో సినిమా చేస్తే.. సినిమా మన చేతుల్లో ఉండదు.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

May 8, 2024

మెగా హీరోలతో సినిమా చేస్తే.. సినిమా మన చేతుల్లో ఉండదు.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

సాయి రాజేష్ పరిచయం అవసరం లేని పేరు ఇటీవల ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించినటువంటి బేబీ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించినటువంటి సాయి రాజేష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇక ఈయన మెగా డైరెక్టర్ అనే సంగతి మనకు తెలిసిందే. ఆ ఫ్యామిలీకి వీరాభిమాని కూడా.

ఇలా మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా ఉన్నటువంటి ఈయన ఇప్పటివరకు మెగా హీరోలతో కలిసి సినిమాలు చేయలేదు అలాగే స్టార్ హీరోలతో కూడా సినిమా చేయలేదు. అయితే తాజాగా స్టార్ హీరోలతో అలాగే మెగా హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు సాయి రాజేష్ సమాధానం చెబుతూ..

నాకు పెద్ద హీరోలతో సినిమా చేయాలి అనే ఆలోచన ఎప్పుడూ కూడా లేదని తెలిపారు. వారితో సినిమా చేయాలి అంటే నాకు అంత కంఫర్టబుల్ గా ఉండదు వారు సెట్లోకి అడుగుపెట్టనంత వరకే ప్రశాంతంగా ఉంటుంది కానీ తర్వాత వాతావరణం మొత్తం మారిపోతుందని ఈయన వెల్లడించారు. ఇలా పెద్ద హీరోలతో సినిమాలు కనుక చేస్తే ఆ సినిమా మన చేతుల్లో ఉండదు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే మన చేతుల్లో ఉండదు అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో బహుశా ఈయనకు సినిమా అవకాశాలు కూడా లేకుండా పోవచ్చు అన్న సందేహాలు కూడా అందరికీ వ్యక్తం అవుతున్నాయి కానీ నిజాలు బయటకు చెబితే ఏమవుతుంది నాకు చిన్న హీరోలు ఉన్నారు వారితో సినిమాలు చేస్తాను అని చాలా ధైర్యంగా ఈయన ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి విషయాలను బహిరంగంగా తెలియచేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Read More: ఆర్య ఆడకపోతే నా పేరు మార్చుకుంటానని శపథం చేశాను.. ఇదేనా ఇడియట్: అల్లు అర్జున్

Related News

ట్రెండింగ్ వార్తలు