May 8, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రం ఆర్య. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హైదరాబాద్లో మరోసారి ఈ చిత్ర బృందం పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆర్య సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను బయటపెట్టారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఆర్య సినిమా విడుదలైన తర్వాత చాలామంది సినిమా చూసి ఈ సినిమా కచ్చితంగా 10 వారాలు ఆడుతుందని చెప్పారు. అయితే ఒక కొత్త డైరెక్టర్ తీసిన సినిమా అప్పట్లో 10 వారాలు ఆడటం అంటే సూపర్ హిట్ అని నాన్న దిల్ రాజు గారు మాట్లాడుకున్నారు. కానీ ఆ మాటలు విని నాకు సుకుమార్ గారికి చాలా చిరాకు వచ్చింది అయితే ఇంట్లో కూడా ఒకసారి నాన్న ఈ సినిమా 10 వారాలు ఆడుతుంది అని చెప్పడంతో 10 వారాలు ఏంటి కచ్చితంగా ఈ సినిమా 125 రోజులు ఆడుతుందని నాన్నతో వాదించాను.
ఈ సినిమా 125 రోజులు గనుక ఆడకపోతే నా పేరు మార్చుకుంటానని కూడా చెప్పాను అయితే ఈ సినిమా 125 రోజుల షీల్డ్ చిరంజీవి గారి చేతుల నుంచి నేను అందుకున్నానని ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలియజేశారు. ఇక దిల్ సినిమా స్క్రీనింగ్ వేసినప్పుడు నేను చూడటానికి వెళ్లాను అక్కడే సుకుమార్ గారిని కలిసాను. ఆయన నాకు ఆర్య స్టోరీ చెబుతున్నప్పుడు ప్రతి సీన్ చాలా నచ్చింది ఆ క్షణం అనుకున్నాను ఇదేనా ఇడియట్ సినిమా అని అంటూ అల్లు అర్జున్ తెలిపారు ఇడియట్ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా చేయాలనుకున్నాను. ఇక సుకుమార్ గారు కథ చెప్పడంతో ఇదే నా ఇడియట్ అని భావించను అయితే ఆ సినిమాకు ఈ సినిమాకు పోలిక లేకపోయినా నాకు అలా అనిపించింది అంటూ బన్నీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More: పవన్ కోసం అలాంటి త్యాగం చేసిన రేణు దేశాయ్.. నిజంగా గ్రేట్ అంటూ?