నాకు తండ్రి కావాలని ఉంది.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

March 29, 2024

నాకు తండ్రి కావాలని ఉంది.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అనంతరం పెళ్లి చూపులు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోగా ఎంతమంది సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోగా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.

ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది ఇక ఈ సినిమా తర్వాత ఈయన తన తదుపరి చిత్రం ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమిళనాడులో ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజయ్ దేవరకొండ తన వృత్తిపరమైన విషయాలను మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా తన ప్రేమ పెళ్లి గురించి ఈయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తనకి కూడా అందరిలాగే పెళ్లి చేసుకోవాలని ఉందని తండ్రి కావాలని ఉంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు అయితే తాను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని ఈయన తెలిపారు. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు కూడా నచ్చుతుందని విజయ్ దేవరకొండ తెలిపారు. ఇకపోతే కొంతకాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Read More: వాళ్లతో పోలిస్తే మాకేం తక్కువ.. నార్త్ సెలెబ్రెటీలపై ప్రియమణి కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు