Dunki Trailer: బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్.. అద్భుతంగా ఆకట్టుకున్న డ్రోన్ షో

December 20, 2023

Dunki Trailer: బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్.. అద్భుతంగా ఆకట్టుకున్న డ్రోన్ షో

Dunki Trailer: కింగ్ ఖాన్ షారూక్(Shah Rukh Khan), రాజ్ కుమార్ హిరాని(Rajkumar Hirani) కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అందులో భాగంగా ఆయన బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్‌ను(Dunki Trailer) ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి లక్షకు పైగా అభిమానులు, వీక్షకులు రావటం విశేషం.

షారూక్ సైతం లుట్ పుట్ గయా..ఓ మాహి..పాటలకు డాన్స్ చేస్తూ కనిపించారు. ఈవెంట్‌లో భాగంగా అద్భుతమైన డ్రోడ్ షోను ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతో ఆకాశమంతా వెలుగులు నిండిపోయాయి. అది చూస్తున్న అభిమానులు చక్కటి అనుభూతికి లోనయ్యారు.

‘డంకీ’ తో  బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read More: Keedaa Cola OTT Release: ఓటీటీలోకి కీడాకోలాస్ట్రీమింగ్ ఎప్పుడంటే

ట్రెండింగ్ వార్తలు