అలియా, రణ్‌బీర్‌, విక్కీ కౌశల్ కాంబినేష‌న్‌లో భన్సాలీ ప్రేమ‌క‌థ‌

January 24, 2024

అలియా, రణ్‌బీర్‌, విక్కీ కౌశల్ కాంబినేష‌న్‌లో భన్సాలీ ప్రేమ‌క‌థ‌

దేవ‌దాస్‌, రామ్ లీలా, బాజీరావ్ మ‌స్తానీ, గంగుబాయ్‌, ప‌ద్మావ‌త్‌..పీరియాడిక్‌ డ్రామా, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌, ప్రేమకథలు…ఇలా భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ.

ప్రస్తుతం ఆయన రణ్‌వీర్‌ సింగ్ తో బైజు బార్వా, షారుక్‌ ఖాన్‌తో ఇన్షాఅల్లా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన మ‌రో మల్టీస్టారర్‌ ప్రేమకథను తెరకెక్కించ‌నున్నారు. ఆ లవ్‌స్టోరీలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, విక్కీ కౌశల్‌ కీలక పాత్రలు పోషించ‌నున్నారు. ఆ సినిమా నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

‘అలియా, రణ్‌బీర్‌ స్క్రిప్ట్‌ విన్నారు. రెండు ఫ్యామిలీల‌ చుట్టూ తిరిగే ఓ ప్రేమకథకు వారు పచ్చజెండా ఊపారు. విక్కీ కూడా ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. ఇక విక్కీకి జోడీగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది’ అని బీటౌన్‌లో వినిపిస్తోంది.

ప్ర‌జెంట్ ట్రెండ్‌కు అనుగునంగా భ‌న్సాలీ ఈ క‌థ‌ను రెడీ చేశారంట‌..ఈ రెండు జంట‌ల మ‌ధ్య భావోద్వేగాలు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. ఇక ఈ సినిమాలో విక్కీకి జంట‌గా ఎవ‌రు న‌టిస్తే బాగుంటుందో మీ కామెంట్ రూపంలో తెలియ‌జేయండి.

Read More: పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు..నెటిజ‌న్‌పై యాంక‌ర్ ర‌ష్మి ఫైర్‌

ట్రెండింగ్ వార్తలు