మాళవిక మోహనన్ ఈయన కూతురా… ఈయన ఒక స్టార్ ఫోటోగ్రాఫర్!

March 28, 2024

మాళవిక మోహనన్ ఈయన కూతురా… ఈయన ఒక స్టార్ ఫోటోగ్రాఫర్!

మాళవిక మోహన్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలని అందుకుంటూ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది ఈ భామ. పెట్టం పోలే అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక తర్వాత రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్ర పోషించింది. మలయాళ భామ అయిన మాళవిక మోహన సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తూ ఉంటుంది

రీసెంట్ గా ఈమె ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసింది. అయితే ఇప్పుడు ఈమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈమె తండ్రి ఒక స్టార్ కెమెరామెన్ అని ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఆయన ఒక తెలుగు సినిమాకి కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. ఆయనే ఇండియాలోనే టాప్ మోస్ట్ ఫోటోగ్రాఫర్స్ లో ఒకరైన కేయు మోహనన్. బాలీవుడ్ సినిమాలు అయిన డాన్, తలాష్ లస్ట్ స్టోరీస్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కి వర్క్ చేశారు.

తెలుగులో కూడా మహేష్ బాబు సినిమా మహర్షి కి కెమెరామెన్ గా వర్క్ చేసి మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాకి వర్క్ చేస్తున్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కేయు మోహన్ మీడియాతో మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ సినిమా ఒక మిడిల్ క్లాస్ కధ. ఈ సినిమా కోసం మిడిల్ క్లాస్ కనపడేలాగా సెట్స్ వేసాము. మనం నిర్లక్ష్యం చేస్తున్న ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఈ సినిమా చెప్తుంది.

ప్రస్తుతం ఇండియాలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ నడుస్తున్నాయి, అయితే ఉమ్మడి కుటుంబం విలువలు గురించి ఈ సినిమాలో చూపెట్టబోతున్నాము. ఈ సినిమాలో ఒక భారతీయ కుటుంబ కథతో పాటు ఒక అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది అని చెప్పారు కేయూ మోహనన్. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read More: ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్?

Related News

ట్రెండింగ్ వార్తలు