అలాంటి దుస్తులు ధరిస్తేనే రేప్ చేస్తారా.. వైరల్ అవుతున్న అనసూయ కామెంట్స్!

April 27, 2024

అలాంటి దుస్తులు ధరిస్తేనే రేప్ చేస్తారా.. వైరల్ అవుతున్న అనసూయ కామెంట్స్!

అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ఈమె బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండి తెర నటిగా వరుస పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు..

సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే అనసూయ తన వస్త్రధారణ విషయంలో భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పొట్టి పొట్టి దుస్తులను ధరిస్తూ గ్లామరస్ ఫోటోలకు ఫోజులిస్తూ ఈమె సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.. అయితే ఈమె వస్త్రధారణ విషయంలో చాలామంది కామెంట్లు చేశారు. అయితే వారందరికీ కూడా తన స్టైల్ లోనే ఈమె వార్నింగ్ ఇచ్చారు నా దుస్తులు నా ఇష్టం నాకు సౌకర్యంగా నాకు నచ్చినట్టుగా నేను వేసుకుంటాను అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు.

అయితే తాజాగా అనసూయ అభిమాని సోషల్ మీడియా వేదికగా మోడరన్ దుస్తులు కట్టినా, సాంప్రదాయ దుస్తులు వేసుకున్నా మానభంగాలు ఆగవు. డ్రెస్సింగ్ లో కాదు, మార్పు రావాల్సింది మీ ఆలోచనా విధానంలో అని అర్థం వచ్చేలా ఆ పోస్ట్ ఉంది. అయితే ఈ పోస్టును అనసూయ కోట్ చేస్తూ.. నా చుట్టూ ఉన్న మనుషులు ఇలా ఉంటారు. వారు ఒకరిని వేధించరు. రెచ్చగొట్టరు. వేదనకు గురి చేయరు… అని అభిప్రాయపడింది. మానభంగాలకు యువతుల డ్రెస్సింగ్ కారణం కాదని ఆమె పరోక్షంగా మద్దతు పలికింది. ప్రస్తుతం అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ఈమె ఇటీవల రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఈ సినిమా తర్వాత అనసూయ పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమాలో ఈమె దాక్షాయని అనే నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది.

Read More: పిల్లల కోసం పెళ్లి కాకుండానే ఆ పనికి సిద్ధమైన సీతారామన్ బ్యూటీ?

ట్రెండింగ్ వార్తలు