ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్?

March 28, 2024

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్?

నటుడు విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరికెక్కినటువంటి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ పోస్టర్స్ పాటలు కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. మరి ట్రైలర్ వీడియో ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వస్తే..

ట్రైలర్ చూస్తుంటే.. కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినటువంటి అబ్బాయి తన ఫ్యామిలీతో పాటు తన ఎమోషన్స్, అలాగే బాధ్యతలను , తన ప్రేమను ఏ విధంగా హ్యాండిల్ చేశాడు వీటన్నింటినీ హ్యాండిల్ చేస్తూ తన జీవితంలో ఎలా ముందుకు వెళ్లారు అనే విషయాలను చూపించబోతున్నారని తెలుస్తుంది.

ఇక యాక్షన్స్ సన్ని వేషాల విషయానికి వస్తే ఈయన పరసురాం డైరెక్షన్ లో నటించిన గీత గోవిందం సినిమాలో కంటే కాస్త ఎక్కువగానే యాక్షన్ సన్ని వేషాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి సినిమా తప్పకుండా హిట్ అవుతుందని విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్ అనేలా ట్రైలర్ ఉంది అంటూ ఈ ట్రైలర్ పై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Read More: వాళ్లది టామ్ అండ్ జెర్రీ రిలేషన్.. రామ్ చరణ్ ని అభినందిస్తూ మంచు మనోజ్ స్పీచ్!

ట్రెండింగ్ వార్తలు