బాలకృష్ణకు సంస్కారం లేదు.. తిరిగి కొడితే ఏం చేస్తావ్.. పెద్ద సైకో: డైరెక్టర్ రవికుమార్

April 27, 2024

బాలకృష్ణకు సంస్కారం లేదు.. తిరిగి కొడితే ఏం చేస్తావ్.. పెద్ద సైకో: డైరెక్టర్ రవికుమార్

డైరెక్టర్ రవికుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తెలుగులో బాలకృష్ణకు సినిమాలకు కూడా పనిచేశారు. అయితే గత కొద్ది రోజుల క్రితం బాలయ్య పై విమర్శలు చేసినటువంటి ఈయన తాజాగా మరోసారి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

బాలకృష్ణ అభిమానులు కనుక కాస్త ఇబ్బంది పెడితే వారిపై చేయి చేసుకుంటారని సంగతి మనకు తెలిసిందే తన ముందు ఎవరున్నా తనకు సంబంధం లేదని ఈయన అందరిపై చేయి చేసుకుంటూ ఉండటం మనం పలు సందర్భాలలో చూసాము అయితే తాజాగా ఈ విషయం గురించి రవికుమార్ మాట్లాడుతూ బాలకృష్ణకు సంస్కారం లేదని పెద్ద సైకోగా మారిపోయారని తెలిపారు.

కె.విశ్వనాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ జననీ జన్మభూమి సినిమా చేసే సమయంలో నేను అసోసియేటెడ్ డైరెక్టర్ గా పని చేశానని ఈయన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అభిమానులు అక్కడికి రావడంతో బాలకృష్ణ వారితో ఫోటో దిగుతున్నారని ఇందులో ఒక అభిమాని బాలయ్య పై చేయి వేయడంతో తన చెంప చెల్లుమనిపించారని తెలిపారు.

ఇలా ఆ సంఘటన చూసిన తర్వాత నాకు మనసు విరిగిపోయిందని రవికుమార్ వెల్లడించారు అయితే ఒకప్పుడు ఎంతో సరదాగా ఉండే బాలయ్య ఇప్పుడు మాత్రం సైకోగా మారిపోయారు. ఈయన అభిమానులపై చేయి చేసుకుంటారు అదే అభిమాని తిరిగి కొడితే ఏం చేస్తారు అంటూ ఈ సందర్భంగా రవికుమార్ బాలయ్య గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం కూడా రవికుమార్ బాలయ్య గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు బాలయ్య ముందు ఎవరైనా నవ్వితే వారి పనీఅయిపోతుందంటూ ఈయన పలు సందర్భాలలో తెలియజేశారు.

Read More: అలాంటి దుస్తులు ధరిస్తేనే రేప్ చేస్తారా.. వైరల్ అవుతున్న అనసూయ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు